Advertisement

  • ఏపీలో కొత్త వైరస్ టెన్షన్ ...తప్పు అడ్రస్ ఇచ్చిన బ్రిటన్ నుంచి వచ్చిన పదహారు మంది

ఏపీలో కొత్త వైరస్ టెన్షన్ ...తప్పు అడ్రస్ ఇచ్చిన బ్రిటన్ నుంచి వచ్చిన పదహారు మంది

By: Sankar Fri, 25 Dec 2020 7:19 PM

ఏపీలో కొత్త వైరస్ టెన్షన్ ...తప్పు అడ్రస్ ఇచ్చిన బ్రిటన్ నుంచి వచ్చిన పదహారు మంది


యూకే నుంచి ఏపీకి ఎంత మంది వచ్చారోననే అంశంపై ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. గత నెల రోజులుగా 1148 మంది యూకే నుంచి వచ్చారని గుర్తించింది ప్రభుత్వం. వీరిలో 1040 మందిని ట్రేస్ చేసిన అధికారులు అందులో 16 మంది తప్పుడు అడ్రస్సులు ఇచ్చినట్టు గుర్తించారు. ఇంకా 88 మందిని ప్రభుత్వం గుర్తించాల్సి ఉంది.

గుర్తించిన వారిలో 982 మందిని క్వారంటైనులో ఉంచారు. అయితే వీరిలో నలుగురికు కరోనా పాజిటీవుగా నిర్ధారణ అయింది. కరోనా పాజిటీవ్ అని తేలిన నలుగురు శాంపిళ్లను సీసీఎంబీ, పుణే ల్యాబులకు పంపిన అధికారులు. కొత్త స్ట్రెయినా.. కాదా అనే నిర్ధారణకు పుణేకు పంపామని ప్రభుత్వం స్పష్టం చేసింది. మూడు రోజుల్లో ఫలితాలు వస్తాయని అధికారులు చెబుతున్నారు.

ఇక ఏపీలో కొత్తగా 355 కరోనా కేసులు నమోదయ్యాయి..జిల్లా వారీగా చూస్తే అనంతపురంలో 15, చిత్తూరులో 81, తూర్పుగోదావరి జిల్లాలో 49, గుంటూరులో 53, కడపలో 12, కృష్ణాలో 43, కర్నూలులో 12, నెల్లూరులో 24, ప్రకాశంలో 12, శ్రీకాకుళంలో 12, విశాఖపట్నంలో 28, విజయనగరంలో 6, పశ్చిమ గోదావరిలో 8 కేసులు నమోదయ్యాయి.

Tags :
|
|

Advertisement