Advertisement

  • తెలంగాణాలో 1567 కొత్త కరోనా పాజిటివ్ కేసులు... యాబైవేలు దాటిన మొత్తం కేసులు

తెలంగాణాలో 1567 కొత్త కరోనా పాజిటివ్ కేసులు... యాబైవేలు దాటిన మొత్తం కేసులు

By: Sankar Fri, 24 July 2020 07:44 AM

తెలంగాణాలో 1567 కొత్త కరోనా పాజిటివ్ కేసులు... యాబైవేలు దాటిన మొత్తం కేసులు



రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసుల పరిస్థితి పూర్తి బిన్నంగా ఉంది ..వారం క్రితం వరకు ఏపీ కంటే తెలంగాణాలో అత్యధిక కేసులు నమోదు అయ్యాయి ..అయితే కేవలం వారం రోజుల వ్యవధి లోనే ఏపీలో అమాంతం కేసులు పెరగగా , తెలంగాణాలో మాత్రం నిలకడగా ఉన్నాయి ..గురువారం మొత్తం 1567 కరోనా కొత్త కేసులు నమోదైనట్లుగా హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 50,826కు చేరింది. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 11,052గా ఉన్నాయి..

గత 24 గంటల్లో 1661 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకూ పూర్తిగా కోలుకొని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 39,327 కు చేరింది. అంటే బాధితుల రికవరీ రేటు 77.3 శాతంగా బులెటిన్‌లో పేర్కొన్నారు. ఇక గురువారం మరో 9 మంది కరోనాకు బలి కాగా, మొత్తం చనిపోయిన వారి సంఖ్య 447కి చేరింది. మరణాల రేటు ఒక శాతం కన్నా తక్కువగా 0.87 శాతంగా ఉంది.

గురువారం నాడు గుర్తించిన కరోనా కేసుల్లో జిల్లాల్లోనూ పెద్ద ఎత్తున కేసులను గుర్తించారు. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే అధికంగా 662 కొత్త కేసులు నమోదు కావడం గమనార్హం. ఆ తర్వాత కేసుల తాకిడి అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో ఉంది. అక్కడ 213 కొత్త కేసులు నమోదు కాగా, ఆ తర్వాత వరంగల్ అర్బన్ జిల్లాలో 75 కొత్త కరోనా కేసులను గుర్తించారు. దాని తర్వాతి స్థానంలో గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఉంది. ఇక్కడ 62 కేసులు నమోదయ్యాయి.

Tags :
|
|

Advertisement