Advertisement

  • భారత్ కు పెరిగిన విదేశీ పెట్టుబడులు ..అత్యధికంగా గుజరాత్ కు

భారత్ కు పెరిగిన విదేశీ పెట్టుబడులు ..అత్యధికంగా గుజరాత్ కు

By: Sankar Sun, 29 Nov 2020 10:12 PM

భారత్ కు పెరిగిన విదేశీ పెట్టుబడులు ..అత్యధికంగా గుజరాత్ కు


ఈ ఏడాది భారత్ కు ఫారెన్ ఇన్వెస్టిమెంట్స్ పెరిగాయి. ఆర్థిక సంవత్సరం 2020-21 ఆరునెలల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్ డీఐలు)15శాతం పెరిగాయి.

ఏప్రిల్-సెప్టెంబర్ కాలంలో గత ఏడాదితో పోలిస్తే ఈ పెట్టుబడులు పెద్ద ఎత్తున పెరిగాయని ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కేవలం ఆరు నెలల కాలంలో దేశంలోకి 30 బిలియన్ డాలర్లు (2.22 లక్షల కోట్లు) విదేశీ పెట్టుబడులు వచ్చాయి. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలంలో 26 బిలియన్ డాలర్లుగా నమోదయింది.

ఇందులో ఎక్కువగా పెట్టుబడులు మారిషస్(29 శాతం), సింగపూర్ (21 శాతం) నుంచి వచ్చాయి.ఆ తర్వాత స్థానంలో అమెరికా, నెదర్లాండ్స్, జపాన్ 7 శాతం అంతకంటే ఎక్కువగా ఉన్నాయి. ఎఫ్ డీఐలు భారత్‌కు పెరగడంతో మారిషస్ నాలుగో స్థానానికి చేరింది..ఇక రాష్ట్రాలవారీగా చూస్తే గుజరాత్‌కు సగానికి పైగాఎఫ్ డీఐలు వచ్చాయి. ఈ రాష్ట్రానికి 16 బిలియన్ డాలర్లు వచ్చాయి. ఆ తర్వాత మహారాష్ట్ర ఉండగా, మూడో స్థానంలో కర్ణాటక ఉంది.

Tags :
|

Advertisement