Advertisement

తిరుమల కాటేజీ వద్ద కొండ చిలువ కలకలం

By: Anji Sun, 30 Aug 2020 08:16 AM

తిరుమల కాటేజీ వద్ద కొండ చిలువ కలకలం

తిరుమల కొండల్లో లాక్ డౌన్ కారణంగా క్రూర మృగాలు సంచరిస్తున్నాయి. తాజాగా తిరుమలలో 15 అడుగుల పొడవున్న కొండ చిలువ కలకలం సృష్టించింది. భక్తుల సంచారమున్న ప్రాంతంలోనే అది దర్శనమివ్వడం భక్తులను ఆందోళనకు గురిచేసింది.
జేఈఓ కార్యాలయంకు సమీపంలోని ఎస్ఎంసి కాటేజీ వద్ద చెట్టులోని కొమ్మకు పెనవేసుకొనున్న కొండ చిలువను చూసి భక్తులు బిత్తరపోయారు. దీని గురించి అధికారులకు సమాచారమిచ్చారు. అటవీశాఖ అధికారులు అక్కడకు చేరుకుని కొండ చిలువను చాకచక్యంగా పట్టుకున్నారు.

Tags :

Advertisement