Advertisement

  • ప్రేమించిన అబ్బాయిని కలవడానికి వెళ్లి గ్యాంగ్ రేప్ డ్రామా ఆడిన బాలిక...!

ప్రేమించిన అబ్బాయిని కలవడానికి వెళ్లి గ్యాంగ్ రేప్ డ్రామా ఆడిన బాలిక...!

By: Anji Sun, 29 Nov 2020 7:56 PM

ప్రేమించిన అబ్బాయిని కలవడానికి వెళ్లి  గ్యాంగ్ రేప్ డ్రామా ఆడిన బాలిక...!

ఓ అబ్బాయిని ప్రేమించిన 14 ఏళ్ల బాలిక ఇంట్లో తన విషయం తెలియకూడదని గ్యాంగ్ రేప్ డ్రామా ఆడి అందరిని ఫూల్ చేసింది. ఛత్తీస్‌గడ్‌లో జరిగిన ఈ సంఘటన అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గడ్‌లో ఉండే ఓ బాలిక ఓ రోజు రాత్రి అతడి బాయ్‌ఫ్రెండ్‌ను కలవడానికి అతడి ఇంటికి వెళ్లింది. కబుర్లలో మునిగితేలిన ఆ జంట సమయం చూసుకోకపోవడంతో చాలా ఆలస్యమైంది.

ఇప్పుడు ఇంటికి వెళితే తల్లిదండ్రులు వివరాలు ఆరా తీస్తే తమ విషయం బయటపడిపోతుందని భయపడింది. దీంతో ఇద్దరు కలిసి ఓ ఉపాయం ఆలోచించి అమలు చేయాలనుకున్నారు.

ఇదిలా ఉండగా అమ్మాయి కనిపించడం లేదని ఆమె తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కొంత సమయానికి అమ్మాయి ఇంటికి రాగా ఏం జరిగిందని తల్లిదండ్రులు ప్రశ్నంచారు. దీంతో ఆ బాలిక ఫ్రెండ్ దగ్గరికి వెళ్లి వస్తుండగా కొంతమంది తనను ఎత్తుకెళ్లి రేప్ చేశారని తెలిపింది.

దీంతో తల్లిదండ్రలు భయపడి బాలికను తీసుకొని పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చారు. అయితే ఎంత వెతికినా బాలిక చెప్పిన వ్యక్తులు పోలీసులకు కనిపించలేదు. దీంతో బాలికను, ఆమె తల్లిదండ్రులను, ఆ అబ్బాయిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. అమ్మాయిని, అబ్బాయిని వేరు వేరుగా విచారించారు.

దీంతో పోలీసులకు అసలు విషయం తెలిసింది. ఇద్దరిని పక్క పక్కన నిలబెట్టి అడగ్గా అసలు విషయం చెప్పారు. ప్రేమ విషయం బయటపడుతుందని అబద్ధం చెప్పాలని అనుకున్నామని చెప్పారు.

దీంతో ఆశ్చర్యపోవడం తల్లిదండ్రులు, పోలీసుల వంతయింది. దీంతో బాలికకు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించగా బాలుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఎందుకంటే అప్పటికే ఆ బాలుడు ఆ అమ్మాయితో ఫిజికల్ టచ్‌లో ఉన్నట్లు తెలిపాడు.

Tags :

Advertisement