Advertisement

  • ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన రోజునే సభలో గందరగోళం...13 మంది సభ్యులు సస్పెండ్...!

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన రోజునే సభలో గందరగోళం...13 మంది సభ్యులు సస్పెండ్...!

By: Anji Mon, 30 Nov 2020 7:11 PM

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన రోజునే సభలో గందరగోళం...13 మంది సభ్యులు సస్పెండ్...!

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన రోజునే సభలో గందరగోళం నెలకొన్నది. టిడిపి సభ్యులు అడిగిన అంశాన్ని పదేపదే అడుగుతున్నారని, ఒకసారి సమాధానం చెప్పమని ప్రభుత్వం చెప్పడంతో టీడీపీ అభ్యంతరం తెలిపింది.

చంద్రబాబు నాయుడు నిరసన తెలియజేస్తూ స్పీకర్ పోడియం వద్ద కింద కూర్చొని నిరసన తెలియజేశారు. పలుమార్లు స్పీకర్ హెచ్చరించినా అక్కడి నుంచి కదల్లేదు. దీంతో ప్రతిపక్ష సభ్యులను సభనుంచి సస్పెండ్ చేయాలని కోరుతూ నాని సస్పెండ్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

చంద్రబాబుతో సహా 13 మంది సభ్యులను ఒకరోజుపాటు సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. సస్పెండ్ అయిన సభ్యులు సభనుంచి వెళ్లిపోవాలని స్పీకర్ ఆదేశించారు.

చంద్రబాబు, అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరి, కేశవ్, రామానాయుడు, సాంబశివరావు, అశోక్, జోగేశ్వర రావు, సత్యప్రసాద్, మంతెన రామరాజు, బాల వీరాంజనేయ స్వామి, రామకృష్ణబాబు, ఆదిరెడ్డి భవాని, తదితరులు సస్పెండ్ అయినవారిలో ఉండటం జరిగింది.

Tags :

Advertisement