Advertisement

ఉత్తరప్రదేశ్‌లో పిడుగుపడి 13 మంది మృతి

By: chandrasekar Mon, 01 June 2020 5:40 PM

ఉత్తరప్రదేశ్‌లో పిడుగుపడి 13 మంది మృతి


ఉత్తరప్రదేశ్‌లో శనివారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో పిడుగులు పడ్డాయి. యూపీ వ్యాప్తంగా పిడుగుపాటుకు 13 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఉన్నావ్‌ జిల్లాలో ఎనిమిది మంది, కన్నౌజ్‌ జిల్లాలో ఐదుగురు మృతి చెందారు. భారీ వర్షానికి పలు జిల్లాల్లో పంటలు దెబ్బతిన్నాయి. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. పిడుగుపాటుకు మృతి చెందిన 13 మంది కుటుంబాలకు సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు సీఎం. గాయపడ్డ వ్యక్తులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆయన ఆదేశించారు.

మృతుల్లో 14 ఏళ్ల బాలిక ఉంది. 70 ఏళ్ల వృద్ధురాలు తీవ్ర గాయాలతో బాధపడుతూ ఆస్పత్రికి తీసుకెళ్లే లోపే మృతి చెందింది. మే 28, 1959లో లక్నోలో 57 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. మళ్లీ 61 ఏండ్ల తర్వాత లక్నోలో 57.4 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదు అయింది.


Tags :
|
|
|

Advertisement