Advertisement

  • నేటి నుంచే బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాలు ...వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించనున్న మోడీ

నేటి నుంచే బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాలు ...వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించనున్న మోడీ

By: Sankar Tue, 17 Nov 2020 06:43 AM

నేటి నుంచే బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాలు ...వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించనున్న మోడీ


నేటి నుంచి బిక్స్‌ శిఖరాగ్ర సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రష్యా వేదికగా 12వ బిక్స్‌ దేశాల సమావేశాలు జరుగుతుండగా.. ప్రధాని నరేంద్ర మోదీ వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా ప్రసంగించనున్నారు.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్‌ పుతిన్‌ ఆహ్వానం మేరకు వర్చువల్‌ శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొంటున్నారని విదేశాంగ మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది ‘గ్లోబల్ స్టెబిలిటీ, షేర్డ్ సెక్యూరిటీ అండ్ ఇన్నోవేటివ్ గ్రోత్’ అనే అంశంపై సమావేశం జరుగుతుందని పేర్కొంది.

ఐక్యరాజ్యసమితి 75వ వార్షికోత్సవం నేపథ్యంలో కొవిడ్‌-19 మహమ్మారి మధ్యలో ఈ శిఖరాగ్ర సమావేశం జరుగుతోంది. బహుళ పక్ష వ్యవస్థ సంస్కరణ, కొవిడ్‌ మహమ్మారి ప్రభావాన్ని తగ్గించే చర్యలు, ఉగ్రవాదం కట్టడి, వాణిజ్యం, ఆరోగ్యం తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.

సమావేశంలో ప్రధాని మోదీతో పాటు ర‌ష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌, బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో, సౌతాఫ్రికా అధ్యక్షుడు ర‌మాఫోసా పాల్గొన‌నున్నారు. వచ్చే ఏడాది 13వ బిక్స్‌ దేశాల సదస్సు భారత్‌ నిర్వహించనుంది.

Tags :
|
|
|
|

Advertisement