Advertisement

పోలీస్ అకాడమీలో భారీగా కరోనా కేసులు

By: Sankar Sun, 28 June 2020 5:11 PM

పోలీస్ అకాడమీలో భారీగా కరోనా కేసులు



తెలంగాణాలో కరోనా విజృంభణ తీవ్ర స్థాయికి చేరింది రోజుకి 1000 కి పైగా కేసులు నమోదు అయ్యే స్థాయికి వచ్చింది గత పదిరోజులుగా తెలంగాణాలో కరోనా తీవ్రత భయానక వాతావరణాన్ని తలపిస్తుంది ..ఎక్కువగా కేసులు హైదరాబాద్ , రంగారెడ్డి లలో నమోదు అవుతున్నప్పటికీ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు కరోనా వ్యాపించింది ..లాక్ డౌన్ తర్వాత ప్రజలు అందరూ మళ్ళీ ఎప్పటిలాగే తమ రోజు వారి కార్యకలాపాలలో ముమునిగిపోవడం కరోనా విజృంభణకు ప్రధాన కారణం అయింది ..

తాజాగా తెలంగాణ పోలీసు అకాడమీలో కరోనా కలకలం రేపింది. అకాడమీలోని 124 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. కరోనా సోకిన వారిలో అటెండర్‌ స్థాయి నుంచి మొదలుకుని డీఐజీ స్థాయి అధికారులు కూడా ఉన్నారు. దీంతో అప్రమత్తమైన అధికారులు వారందరిని ఐసోలేషన్‌కు తరలించారు. ప్రస్తుతం పోలీసు అకాడమీలో 1900 మంది శిక్షణ పొందుతున్నారు. త్వరలోనే అకాడమీలో ఉన్నవారందరికీ కరోనా పరీక్షలు చేయనున్నట్టుగా తెలుస్తోంది. కాగా, తొలుత అకాడమీలో పనిచేసే వంట మనిషి కరోనా సోకినట్టుగా సమాచారం.

లాక్ డౌన్ సమయంలో అకాడమీ నుంచి ఎవరిని బయటకు పోనివ్వలేదు అలాగే బయట నుంచి ఎవ్వరిని లోపాలకి రానివ్వలేదు దీనితో కరోనా కేసులు ఎక్కువగా నమోదు కాలేదు అయితే ఒక్కసారిగా లాక్ డౌన్ ఎత్తివేసాక ఎప్పటిలానే మల్లి కార్యకలాపాలు సాగడంతో కరోనా కేసులు నమోదు అయ్యాయి .. మరోవైపు రాష్ట్రంలో శనివారం సాయంత్రం వరకు 13,436 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, మొత్తం 243 మంది మృతిచెందారు.

Tags :
|

Advertisement