Advertisement

  • వ్యక్తిగత గోప్యత విషయంలో టిక్ టాక్ పై కేసు వేసిన పన్నెండేళ్ల బాలిక

వ్యక్తిగత గోప్యత విషయంలో టిక్ టాక్ పై కేసు వేసిన పన్నెండేళ్ల బాలిక

By: Sankar Thu, 31 Dec 2020 10:34 PM

వ్యక్తిగత గోప్యత విషయంలో టిక్ టాక్ పై కేసు వేసిన పన్నెండేళ్ల బాలిక


ఇండియాలో నిషేదానికి గురియైన టిక్ టాక్ మీద బ్రిటన్ లో ఒక బాలిక కేసు వేసింది..వ్యక్తిగత గోప్యత విషయంలో ఐరోపా సమాఖ్య నిబంధనలను టిక్‌టాక్‌ ఉల్లంఘించిందని ఆ బాలిక యొక్క ప్రధాన ఆరోపణ.

తన వివరాలను గోప్యాంగ ఉంచుతూ కేసు ఫైల్ చేసేందుకు స్థానిక కోర్టు అనుమతి ఇచ్చింది. టిక్ టాక్ పై చట్టపరమైన చర్యకు ఇంగ్లాండ్ పిల్లల కమిషనర్ అన్నే లాంగ్ఫీల్డ్ మద్దతు ఇస్తున్నారు. టిక్‌టాక్ యుకే, యూరోపియన్ యూనియన్ డేటా రక్షణ చట్టాలను ఉల్లంఘించిందని ఆమె అభిప్రాయపడ్డారు.

ఇంగ్లాండ్‌లో టిక్‌టాక్‌ను ఉపయోగించే 16 ఏళ్లలోపు వారికి ఈ కేసు మరింత రక్షణ చర్యలు కల్పిస్తుందని ఎంఎస్ లాంగ్‌ఫీల్డ్ భావిస్తోంది. డేటా రక్షణ లోపం కారణంగా తన వ్యక్తిగత సమాచారం బహిర్గతం అయ్యిందని బాలిక తెలిపింది. తన వాదనతో ఏకీభవించిన కోర్టు.. తదుపరి విచారణకు ఆదేశించింది.

Tags :
|
|
|

Advertisement