Advertisement

  • అమెరికాలో కారు బీభత్సం ...పన్నెండు మందికి తీవ్ర గాయాలు

అమెరికాలో కారు బీభత్సం ...పన్నెండు మందికి తీవ్ర గాయాలు

By: Sankar Sun, 13 Dec 2020 9:27 PM

అమెరికాలో కారు  బీభత్సం ...పన్నెండు మందికి తీవ్ర గాయాలు


అమెరికాలో ఓ కారు బీభత్సం సృష్టించింది. మాన్హాటన్ ముర్రే హిల్ ప్రాంతంలో శుక్రవారం నిరసన చేపట్టిన నిరసనకారుల పైకి అత్యంత వేగంగా దూసుకెళ్లింది. ఈ ఘటనలో సుమారు 12 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు.

అయితే ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని న్యూయార్క్ పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు పాల్పడిన కారు డ్రైవర్‌తో పాటు, మరో మహిళను అదుపులోకి తీసుకున్నట్లు‌ పేర్కొన్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్నామని, అన్ని కోణాల్లో లోతుగా దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

అయితే శుక్రవారం ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెంట్లు, వలసదారుల నిర్బంధించడాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తును నిరసనకారులు నిరసన చేపట్టారు.

Tags :

Advertisement