Advertisement

  • తెలంగాణాలో మళ్ళీ తగ్గిన కరోనా కేసులు ...తాజాగా 1178 కేసులు నమోదు

తెలంగాణాలో మళ్ళీ తగ్గిన కరోనా కేసులు ...తాజాగా 1178 కేసులు నమోదు

By: Sankar Sun, 12 July 2020 09:37 AM

తెలంగాణాలో మళ్ళీ తగ్గిన కరోనా కేసులు ...తాజాగా 1178  కేసులు నమోదు



తెలంగాణాలో వరుసగా రెండోరోజు కూడా కరోనా కేసులు తగ్గాయి ..దీనితో ప్రజలు కొంచెం ఊరట చెందుతున్నారు ..ముఖ్యంగా మహానగరంలో కరోనా కేసులు చాల రోజుల తర్వాత వెయ్యి కంటే తక్కువగా నమోదు అయ్యాయి ..తాజాగా రాష్ట్రంలో కొత్తగా 1,178 కరోనా కేసులు నమోదయ్యాయి.

దీంతో ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్‌–19 బాధితుల సంఖ్య 33,402కు చేరింది. ఇందులో 12,135 యాక్టివ్‌ కేసులుండగా, 20,919 మంది కోలుకున్నారు. కరోనా వైరస్‌ ప్రభావంతో శనివారం మరో తొమ్మిది మంది మరణించారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 348కి చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,62,171 మందికి పరీక్షలు నిర్వహించగా 1,28,769 మందికి నెగెటివ్‌ వచ్చింది.

శనివారం నమోదైన పాజిటివ్‌ కేసుల్లో అధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 736, రంగారెడ్డిలో 125, మేడ్చల్‌లో 105, కరీంనగర్, సిరిసిల్లలో 24 చొప్పున, వరంగల్‌ అర్బన్‌లో 20, మెదక్‌లో 16, సంగారెడ్డిలో 13, పెద్దపల్లి, మహబూబ్‌ నగర్, నల్లగొండ, నిజామాబాద్‌ జిల్లాల్లో 12 చొప్పున, యాదాద్రి, వికారాబాద్, సిద్దిపేట్‌ జిల్లాల్లో 9 చొప్పున, ఆదిలాబాద్‌లో 8, సూర్యాపేట్‌లో 7, గద్వాలలో 6, నారాయణ్‌ పేట్, మంచిర్యాలలో 5 చొప్పున, జనగామ, జగిత్యాల, వరంగల్‌ రూరల్, నిర్మల్, ఖమ్మం జిల్లాల్లో 2 చొప్పున, ఆసిఫాబాద్‌లో ఒక పాజిటివ్‌ కేసు నమోదైంది.

Tags :
|
|
|
|
|

Advertisement