Advertisement

  • జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మొత్తం 150 స్థానాలకు 1,122 మంది అభ్యర్థులు పోటీ....

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మొత్తం 150 స్థానాలకు 1,122 మంది అభ్యర్థులు పోటీ....

By: chandrasekar Tue, 24 Nov 2020 4:00 PM

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మొత్తం 150 స్థానాలకు 1,122 మంది అభ్యర్థులు పోటీ....


గ్రేటర్‌ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మొత్తం 150 స్థానాలకు 1,122 మంది అభ్యర్థులు బరిలోకి దిగుతున్నారు. అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ ఒక్కటే 150 డివిజన్లలో తమ అభ్యర్థులను పోటీకి నిలిపింది. నవాబ్‌సాహెబ్‌ కుంటలో మినహా 149 డివిజన్లలో బీజేపీ, 146 డివిజన్లల్లో కాంగ్రెస్‌ తమ అభ్యర్థులను రంగలోకి దింపాయి. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం ఒక్కో వార్డులో సగటున ఏడుగురు బరిలో నిలిచారు. అయితే ఎంఐఎం తమకు పట్టున్న పాతబస్తీలో అభ్యర్థులను నిలుపగా, టీడీపీ పాతబస్తీ మినహా మిగిలిన డివిజన్లలో అభ్యర్థులను బరిలోకి దించింది. కమ్యూనిస్టు పార్టీలు కూడా తమ అభ్యర్థులను పోటీలో నిలిపాయి. దీంతోపాటు మొత్తం 415 మంది స్వతంత్ర అభ్యర్థులు ఈ ఎన్నికల్లో పోటీచేస్తున్నారు.

150 డివిజన్లకు...అభ్యర్థుల సంఖ్య..

టీఆర్ఎస్ - 150
బీజేపీ - 149
కాంగ్రెస్ - 146
టీడీపీ - 106
ఎంఐఎం - 51
సీపీఐ - 17
సీపీఎం - 12

స్వతంత్రులు - 415 మంది పోటీ పడుతున్నారు.

అయితే అత్యధికంగా జంగమ్మెట్‌లో 20 మంది పోటీలో నిలవగా జీడిమెట్ల, టోలీచౌకీ, నవాబ్‌సాహెబ్‌కుంట, బార్కాస్‌, ఉప్పల్‌ డివిజన్లలో త్రిముఖ పోటీ జరగనుంది. మరికొన్ని చతుర్ముఖ పోటీ నెలకొంది. అయితే ఎక్కువ స్థానాల్లో బీజేపీ, టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ అభ్యర్థులే బరిలో దిగారు.

Tags :
|

Advertisement