Advertisement

  • కరోనాను జయించిన 110 ఏళ్ళ కేరళ బామ్మ ..అత్యధిక వయస్సు గల మహిళగా రికార్డు..

కరోనాను జయించిన 110 ఏళ్ళ కేరళ బామ్మ ..అత్యధిక వయస్సు గల మహిళగా రికార్డు..

By: Sankar Sun, 30 Aug 2020 08:00 AM

కరోనాను జయించిన 110  ఏళ్ళ కేరళ బామ్మ ..అత్యధిక వయస్సు గల మహిళగా రికార్డు..


కరోనా మహమ్మారి దెబ్బకు యువకులు కూడా బయపడుతున్నారు..ఇక ముసలి వాళ్ళ సంగతి అయితే చెప్పనక్కర్లేదు..అయితే కొన్ని చోట్ల మాత్రం వంద ఏళ్ళు దాటినా వారు కూడా కరోనా నుంచి బయటపడిన సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం..

తాజాగా కేరళ రాష్ట్రంలోని మలప్పురం జిల్లాకు చెందిన 110 వృద్ధురాలు కొవిడ్‌-19 నుంచి కోలుకుంది. రాందాథాని నివాసి అయిన వారియత్ పథు వైరస్‌ నుంచి కోలుకున్న అత్యంత ఎక్కువ వయసు ఉన్న మహిళగా నిలిచింది. తన కుమార్తె నుంచి వైరస్ సోకగా.. ఆగస్టు 18న వృద్ధురాలికి పాజిటివ్‌గా పరీక్షించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీ హాస్పిటల్ (జీఎంసీహె‌చ్‌) మంజెరీ వైద్యులు వృద్ధురాలికి కేవలం తేలికపాటి లక్షలు గుర్తించారు

‘చికిత్స సమయంలో ఆమె కూడా వైద్యులతో బాగా సహకరించింది. పథు రికవరీ కేరళ రాష్ట్రంలోని ఇతర కొవిడ్‌ రోగులకు స్ఫూర్తినిస్తుంది’ అని జీఎంసీహె‌చ్‌ వైద్యుడు ఒకరు చెప్పారు. వ్యాధి నుంచి కోలుకున్న తర్వాత తిరిగి ఆమెను చూడడం సంతోషంగా ఉందని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. అలాగే పథుకు మెరుగైన వైద్యం అందించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.



Tags :
|

Advertisement