Advertisement

  • ఉజ్జయినిలో విషాదం ..కల్తీ మద్యం తాగి 11 మంది మృతి

ఉజ్జయినిలో విషాదం ..కల్తీ మద్యం తాగి 11 మంది మృతి

By: Sankar Thu, 15 Oct 2020 6:21 PM

ఉజ్జయినిలో విషాదం ..కల్తీ మద్యం తాగి 11 మంది మృతి


ఉజ్జయిని నగరంలో కల్తీ మద్యానికి 11 మంది బలయ్యారు. గురువారం ఉదయం ఏడుగురు మరణించగా.. మరో రెండు మృతదేహాలను ధాబా రోడ్‌ ప్రాంతంలోని నర్సింగ్ ఘాట్ వద్ద కనుగొన్నారు. దవాఖానలో చికిత్స పొందుతూ ఇద్దరు చనిపోయారు. మృతుల్లో 10 మంది కూలీలు ఉన్నారు.

వీరంతా ఫుట్‌పాత్‌పై నివసిస్తూ దినసరి కూలీలుగా పనిచేసుకుంటూ పొట్టపోసుకుంటున్నారు. కల్తీ మద్యం కేసులో ఇప్పటివరకు ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా, కల్తీ మద్యం జోరుగా సాగేందుకు నిర్లక్ష్యం ప్రదర్శించిన ఖరాకువాన్ పోలీస్ స్టేషన్ ఇంచార్జి ఎంఎల్ మీనా, ఎస్‌ఐ నిరంజన్ శర్మ, కానిస్టేబుల్ షేక్ అన్వర్, నవాజ్ షరీఫ్‌లను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.

ఉజ్జయిని పాత నగరంలోని ఖరాకువాన్, మహాకల్, కొత్వాలి పోలీస్ స్టేషన్లలో బుధవారం రాత్రి ఆరుగురు కార్మికులతో పాటు ఏడుగురు మృతిచెందారు. కార్మికులు ఛత్రిచౌక్, ఖరాకువాన్ గాలి, తేలివాడ, బేగంబాగ్ ప్రాంతానికి చెందిన వారుగా గుర్తించారు. పోస్టుమార్టం నివేదిక, పోలీసుల దర్యాప్తులో విషపూరిత మద్యం సేవించడం వల్ల మరణాలు సంభవించినట్లు తేలింది. గురువారం ఉదయం మరో ఇద్దరు కార్మికుల మృతదేహాలను కనుగొన్నట్లు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అదే సమయంలో దవాఖానలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మరణించారు. ఛత్రిచౌక్‌ ప్రాంతంలో ఉన్న మల్టీ-లెవల్ పార్కింగ్ స్థలంలో కొంతమంది రసాయనాలు, స్పిరిట్‌ తదితరాలను వినియోగించి విషపూరిత మద్యం తయారు చేసి రూ.20-30 కు అమ్ముతున్నట్లు ఇప్పటివరకు జరిగిన పోలీసు దర్యాప్తులో తేలింది. ఈ రసాయన తయారీ మద్యాన్ని ఎక్కువగా దినసరి కూలీలు, సన్యాసులు కొనుగోలు చేసి వినియోగించేవారని పోలీసులు గుర్తించారు. అరెస్టయిన ఎనిమిది మందిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

Tags :
|

Advertisement