Advertisement

  • రష్యాలో విషాదం ...వృద్ధాశ్రమంలో అగ్ని ప్రమాదం ..పదకొండు మంది మృతి

రష్యాలో విషాదం ...వృద్ధాశ్రమంలో అగ్ని ప్రమాదం ..పదకొండు మంది మృతి

By: Sankar Tue, 15 Dec 2020 6:29 PM

రష్యాలో విషాదం ...వృద్ధాశ్రమంలో అగ్ని ప్రమాదం ..పదకొండు మంది మృతి


రష్యాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆ దేశంలోని ఓ వృద్ధాశ్రమంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఏకంగా 11 మంది మృతి చెందారు.

బాష్‌ కోర్టొస్టాన్‌ ప్రాంతంలోని ఉరల్‌ పర్వత శ్రేణుల్లో ఉన్న ఓ వృద్ధాశ్రమంలో ఈ దుర్ఘటన జరిగింది. తెల్లవారు జామున 3 గంటలకు ఆ ఆశ్రమంలో భారీగా మంటలు వ్యాపించాయి. ఈ మంటలు సుమారు మూడు నుంచి నాలుగు గంటల పాటు చెలరేగాయి.

అయితే.. ఆ హౌమ్‌లో ఉన్న వారంతా వృద్ధులు కావడంతో అగ్ని ప్రమాదం నుంచి తప్పించుకోలేకపోయారు. దీంతో ఆ వృద్ధులు మంటల్లో బలయ్యారు. ఆ వృద్ధాశ్రమంలో కేవలం నలుగురు మాత్రమే ప్రాణాలతో బయటపడినట్లు రష్యా ఏజెన్సీ ప్రకటించింది.

Tags :
|
|

Advertisement