Advertisement

  • న్యూజిలాండ్ లో 102 రోజుల తర్వాత కరోనా పాజిటివ్ కేసు నమోదు..

న్యూజిలాండ్ లో 102 రోజుల తర్వాత కరోనా పాజిటివ్ కేసు నమోదు..

By: Sankar Tue, 11 Aug 2020 12:02 PM

న్యూజిలాండ్ లో 102 రోజుల తర్వాత కరోనా పాజిటివ్ కేసు నమోదు..



కరోనా ను సమర్థవంతంగా ఎదుర్కొన్న దేశాలలో ఒకటి న్యూజిలాండ్..అక్కడ పాజిటివ్ కేసు నమోదు అయి దాదాపు మూడు నెలలు పైననే అవుతుంది ..అయితే తాజాగా దాదాపు 102 రోజుల తర్వాత న్యూజిలాండ్ లో కరోనా పాజిటివ్ కేసు నమోదు అయింది..మెల్బోర్న్ నుంచి జూలై 30న న్యూజిలాండ్‌కు వచ్చిన 20 ఏండ్ల వ్యక్తికి మంగళవారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ ఆష్లే బ్లూమిఫీల్డ్‌ విలేకరుల సమావేశంలో తెలిపారు.

ఆ వ్యక్తి గ్రాండ్ మిలీనియంలో ఒంటరిగా నివాసముంటున్నాడు. అతను అక్కడ నివిసించిన మూడో రోజు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని, కానీ తొమ్మిది రోజుల నుంచి అతడికి స్వల్ప లక్షణాలు ఉన్నాయని, ఇప్పుడు ఆక్లాండ్ క్వారంటైన్‌ సెంటర్‌కు అతడిని తరలించామని ఆష్లే పేర్కొన్నారు. ఈ ఒక్క కేసుతో ఇప్పటివరకు న్యూజిలాండ్‌లో నమోదైన కేసుల సంఖ్య 1,220కు చేరింది.

సుమారు 101 రోజుల వరకు ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడంతో తాము పూర్తిగా కోలుకున్నట్లు భావించామని, మంగళవారం ఒక్క కేసు నమోదు అయినా దాన్ని సమర్ధవంతంగా ఎదుర్కునేందుకు వెంటనే వ్యక్తిని దవాఖానకు తరలించి చికిత్స అందజేస్తున్నామని ఆష్లే తెలిపారు..

Tags :
|
|
|

Advertisement