Advertisement

  • నిన్నటి మ్యాచ్ విజయంతో ఐపీయల్ లో ఎవరికీ సాధ్యం కానీ రికార్డు సాధించిన ధోని..

నిన్నటి మ్యాచ్ విజయంతో ఐపీయల్ లో ఎవరికీ సాధ్యం కానీ రికార్డు సాధించిన ధోని..

By: Sankar Sun, 20 Sept 2020 12:56 PM

నిన్నటి మ్యాచ్ విజయంతో ఐపీయల్ లో ఎవరికీ సాధ్యం కానీ రికార్డు సాధించిన ధోని..


ఐపీయల్ 2020 ఘనంగా ప్రారంభం అయింది..కరోనా కారణంగా హంగులు ఆర్భాటాలు ఏమి లేకపోయినప్పటికీ ఆటగాళ్లు తమ ఆటతీరుతో ఐపీయల్ కు మంచి ఆరంభాన్ని ఇచ్చారు..ఇక నిన్న జరిగిన తొలి మ్యాచ్ లో ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రోహిత్ సారథ్యంలోని డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ మీద విజయం సాధించింది..అయితే ఈ విజయంతో చెన్నై కెప్టెన్ ధోని ఒక అద్భుత రికార్డు సాధించాడు..

ఐపీఎల్‌లో ఒకే జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ 100 విజయాలు అందించిన కెప్టెన్‌గా నిలిచాడు. ఐపీఎల్‌లో ఈ ఘనత సాధించిన తొలి, ఏకైక కెప్టెన్ ధోనీనే కావడం విశేషం..ఐపీఎల్ టోర్నీలో కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీకి ఇది 105వ విజయం. చెన్నైపై నిషేధం కారణంగా 2016లో రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ జట్టుకు కెప్టెన్‌గా 5 విజయాలు అందించాడు. ఇక కెప్టెన్‌గా మహీ 175 మ్యాచ్‌లు ఆడాడు. ఐపీఎల్ చరిత్రలో ఇదే అత్యధికం. 175 మ్యాచ్‌లలో 105 విజయాలు, 69 ఓటములు ఉన్నాయి. ఒక మ్యాచ్‌లో ఫలితం రాలేదు..

2019 ప్రపంచకప్‌ తర్వాత దాదాపు 437 రోజలు పాటు క్రికెట్‌కు దూరంగా ఉన్న ధోని నిన్న జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌ ద్వారా గ్రౌండ్‌లోకి అడుగుపెట్టాడు. ఇన్ని రోజుల విరామం తర్వాత కూడా తన కూల్‌ కెప్టెన్సీ ఎలా ఉంటుందో అభిమానులకు చూపించాడు. ఆగస్టు 15 సాయంత్రం 7.29 గంటలకు రిటైర్మెంట్‌ ప్రకటించిన ధోని.. సెప్టెంబర్‌ 19న ముంబైతో జరిగిన మ్యాచ్‌లో సాయంత్రం 7.30గంటలకు తిరిగి గ్రౌండ్‌లోకి అడుగుపెట్టడం యాదృశ్చికం అని చెప్పవచ్చు.

Tags :
|
|

Advertisement