Advertisement

  • కేంద్రం కీలక నిర్ణయం: ఇక విద్యుత్ బిల్లు 1000 దాటితే...!

కేంద్రం కీలక నిర్ణయం: ఇక విద్యుత్ బిల్లు 1000 దాటితే...!

By: Anji Sun, 27 Sept 2020 2:24 PM

కేంద్రం కీలక నిర్ణయం: ఇక విద్యుత్ బిల్లు 1000 దాటితే...!

నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది, వినియోగదారులు పే చేసే నగదుకి వారికి సత్వరం విద్యుత్ అందేలా చర్యలు తీసుకోబోతోంది. దేశవ్యాప్తంగా విద్యుత్ వినియోగదారుల హక్కులను వివరించే నిబంధనలను కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ రూపొందించింది.

సబ్సిడీలను నేరుగా లబ్ధిదారులకు అందించేందుకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ తీసుకువస్తోంది. కక పై స్టేట్ లో ఉన్న డిస్కమ్ లు వినియోగదారులకు 24 గంటలూ నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాల్సిందే. ఇక ఎంత విద్యుత్ వాడుతున్నారు, ఎంత డిమాండ్ ఉంది ఇలా పంపిణీ పై అన్నీ డీటెయిల్స్ నమోదు చేస్తారు.. వినియోగదారులకి అందిస్తున్న సేవల్లో అంతరాయం ఉంటే ఖచ్చితంగా ఫెనాల్టీ పడనుంది

కొత్త విద్యుత్ నిబంధనల ప్రకారం కొత్త కనెక్షన్ తీసుకోవడం, ఇంతకు ముందు ఉన్న కనెక్షన్లు మార్చుకోవడం వంటి సేవలు సులువుగా మారనున్నాయి. రూ.1,000, అంతకంటే ఎక్కువ వచ్చిన బిల్లులను ఆన్లైన్లో మాత్రమే చెల్లించాలి అనే రూల్ తీసుకువస్తున్నారు.ఇక బిల్లు చెల్లించే గడువు సమయం అలాగే దానికి ఎంత చార్జ్ పడుతుంది అనే విషయాలపై నిర్ణయాలు తీసుకోబోతున్నారు.

Tags :

Advertisement