Advertisement

2022 నుంచి ఐపీయల్ లో పది టీములు

By: Sankar Thu, 24 Dec 2020 4:34 PM

2022 నుంచి ఐపీయల్ లో పది టీములు


ఐపీఎల్‌లో 2022 నుంచి ప‌ది టీమ్స్ ఆడ‌నున్నాయి. ఈ మేర‌కు వార్షిక స‌ర్వ‌స‌భ్య స‌మావేశంలో బీసీసీఐ దీనికి ఆమోదం తెలిపింది. ఐపీఎల్‌లో కొత్త జ‌ట్లు అనేది బీసీసీఐ ఎజెండాలో ప్ర‌ధాన అంశంగా ఉంది.

ఈ రెండు కొత్త జ‌ట్లు ఏవి అనేది ఇంకా తేల‌లేదు. అయితే ఈ టీమ్స్‌ను కొనుగోలు చేయ‌డానికి గౌత‌మ్ అదానీ, సంజీవ్ గోయెంకాలాంటి దిగ్గ‌జ వ్యాపార‌స్తులు ఆస‌క్తి చూపుతున్నారు. నిజానికి వ‌చ్చే సీజ‌న్ నుంచే ఐపీఎల్‌లో ప‌ది జ‌ట్లు ఉంటాయ‌ని భావించినా.. దానికి త‌గినంత స‌మ‌యం లేదని బోర్డు స‌భ్యులు అభిప్రాయ‌ప‌డ్డారు.

అయితే ప్ర‌స్తుతం 8 జ‌ట్లు ఉన్న ఐపీఎల్‌లో 60 మ్యాచ్‌లు ఆడుతున్నారు. ఇదే చాలా పెద్ద షెడ్యూల్ అనుకుంటే.. ఇక నుంచి 10 టీమ్స్ అంటే మ్యాచ్‌ల సంఖ్య ఏకంగా 94కు పెర‌గ‌నుంది. దీంతో టోర్నీ రెండున్న‌ర నెల‌ల పాటు సాగాల్సి ఉంటుంది. అదే జ‌రిగితే అంత‌ర్జాతీయ షెడ్యూల్‌పై తీవ్ర ప్ర‌భావం ప‌డుతుంది. అంతేకాకుండా ఇన్ని మ్యాచ్‌ల పాటు అంద‌రు విదేశీ ప్లేయ‌ర్స్ అందుబాటులో ఉంటారా లేదా అన్న‌ది కూడా అనుమాన‌మే

Tags :
|

Advertisement