Advertisement

తెలంగాణ హైకోర్టులో కరోనా ...

By: Sankar Wed, 08 July 2020 2:17 PM

తెలంగాణ హైకోర్టులో కరోనా ...



తెలంగాణాలో కరోనా ఎవ్వరిని వదిలేలా లేదు ..ధనిక , పేద , సామాన్య , సెలబ్రిటీ అనే తేడా లేకుండ అందరి మీద తన పంజా విసురుతున్న ఈ వైరస్ తాజాగా తెలంగాణ హైకోర్టు మీద కూడా తన ప్రభావాన్ని చూయించింది..తెలంగాణ హైకోర్టులో ప‌ని చేస్తున్న ఉద్యోగుల‌కు, సెక్యూరిటీ సిబ్బందికి క‌రోనా పాజిటివ్ అని తేల‌డం క‌ల‌క‌లం రేపుతోంది. మంగ‌ళ‌వారం న్యాయ‌స్థానంలో ప‌ని చేసే 50 మందికి సిబ్బందికి ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. నేడు దీని ఫ‌లితాలు వెలువ‌డ‌గా అందులో 10 మందికి పాజిటివ్ అని నిర్ధార‌ణ అయింది. దీంతో అప్ర‌మ‌త్త‌మైన అధికారులు హైకోర్టు భ‌వ‌నాన్ని తాత్కాలికంగా మూసివేసి శానిటైజేష‌న్ చేస్తున్నారు. హైకోర్టులోని ఈ-ఫైలింగ్ విభాగాన్ని జ్యుడీషియ‌ల్ అకాడ‌మీకి త‌ర‌లించారు..

మ‌రోవైపు క‌రోనా ప్రబ‌‌లుతున్న వేళ ముందుజాగ్ర‌త్త‌లు చేప‌ట్టిన హైకోర్టు వీడియో కాన్ఫ‌రెన్స్‌ల ద్వారా ముఖ్య‌మైన కేసుల విచార‌ణ చేప‌డుతున్న విష‌యం తెలిసిందే. అయితే మ‌రిన్ని కేసులు వెలుగుచూస్తున్న త‌రుణంలో ఇదే విధానాన్ని కొన‌సాగిస్తూ కేసుల విచార‌ణ చేప‌ట్ట‌నున్న‌ట్లు నిర్ణ‌యం తీసుకుంది. గురువారం నుంచి వీడియో కాన్ఫ‌రెన్స్‌ను సిటీ సివిల్ కోర్టు భ‌వ‌నంలోకి మార్చ‌గా అందులో కేవ‌లం న్యాయ‌వాదుల‌కే మాత్ర‌మే ప్ర‌వేశానికి అనుమ‌తి ఉంటుంద‌‌ని స్ప‌ష్టం చేసింది. క్ల‌ర్కులు, జూనియ‌ర్ల‌కు లోనికి అనుమ‌తి లేద‌ని పేర్కొంది.

Tags :
|
|
|

Advertisement