Advertisement

  • ఐ ఫోన్ కు భారీ జరిమానా విధించిన ఇటలీ యాంటీట్రస్ట్ అథారిటీ

ఐ ఫోన్ కు భారీ జరిమానా విధించిన ఇటలీ యాంటీట్రస్ట్ అథారిటీ

By: Sankar Mon, 30 Nov 2020 6:14 PM

ఐ ఫోన్ కు భారీ జరిమానా విధించిన ఇటలీ యాంటీట్రస్ట్ అథారిటీ


ఐ ఫోన్ ఈ పేరు వింటే చాలు యువత పిచ్చెక్కిపోతారు ..ఎంత డబ్బులు పెట్టి అయినా సరే ఐ ఫోన్ కొనడంకోసం యువత ఏ మాత్రం వెనకాడరు ...దానికి తగ్గట్లే ఐ ఫోన్ లో ఫీచర్లు కూడా అదే స్థాయిలో ఉంటాయి...అయితే అలాంటి ఐ ఫోన్ మీద భారీగా జరిమానా తప్పలేదు...

ఆ సంస్థ తప్పుడు వ్యాపార విధానాలను అనుసరించిందంటూ.. ఇటలీలోని యాంటీట్రస్ట్‌ అథారిటీ.. యాపిల్ సంస్థకు 10 మిలియన్ యూరోస్ (కోటి 20 లక్షల డాలర్లు) జరిమానాగా విధించింది. ఐఫోన్లకు సంబంధించిన తప్పుడు విధానాలే కారణమంటూ తన ప్రకటనలో పేర్కొంది ఇటలీ యాంటీట్రస్ట్‌ అథారిటీ.

ఇటలీ యాంటీట్రస్ట్‌ అథారిటీ ప్రకటన ప్రకారం.. యాపిల్‌ సంస్థ విడుదల చేసిన పలు మోడళ్ల ఐఫోన్లపై ఎలాంటి వివరాలు ఇవ్వకుండా.. వాటర్‌ రెసిస్టెంట్లుగా ప్రచారం చేసిందని పేర్కొంది.. కంపెనీ డిస్‌క్లైమర్‌లో మాత్రం ద్రవ పదార్థాల నుంచి ఫోన్‌ దెబ్బ తింటే వారంటీ వర్తించదని పేర్కొనడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.. అంతేకాదు.. నీటిలోపడి ఫోన్లు దెబ్బతిన్న వారికి సంస్థ ఎటువంటి సహకారం అందించలేదని కూడా పేర్కొన్నారని.. ఇది వినియోగదారులను మోసం చేయడమేనని చెబుతోంది యాంటీట్రస్ట్ అథారిటీ.

Tags :
|
|

Advertisement