Advertisement

  • కరోనా వ్యాప్తి...ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే రూ. 10 లక్షల ఫైన్!

కరోనా వ్యాప్తి...ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే రూ. 10 లక్షల ఫైన్!

By: Anji Mon, 21 Sept 2020 07:04 AM

కరోనా వ్యాప్తి...ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే రూ. 10 లక్షల ఫైన్!

ఇంగ్లాండ్ లో రెండో దశ కరోనా వ్యాప్తి మొదలైంది. రెండో దశ వైరస్ ను ఎదుర్కొనేందుకు ఆ దేశ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది.దీంతో ఆ దేశ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇంగ్లాండ్ కఠిన ఆంక్షలు విధిస్తోంది. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే 10 000 పౌండ్ల (రూ. 10 లక్షలు ) జరిమానా విధిస్తామని ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది.


వైరస్ నిర్ధారణ అయిన వాళ్లు అనవసరంగా బయట తిరగొద్దని 14 రోజులు ఐసోలేషన్ పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. కరోనాపై బ్రిటన్ ప్రధాని మాట్లాడుతూ ' కరోనా రెండో దశ మహమ్మారి మొదలైంది. ఫ్రాన్స్ స్పెయిన్ యూరప్ లలో కూడా ఈ ప్రభావం మొదలైంది. ప్రతి ఒక్కరూ మహమ్మారిపై నిర్లక్ష్యం వహించకుండా నిబంధనలు పాటించాలి. అదొక్కటే నివారణకు మార్గం. కొత్త నిబంధనల్లో భాగంగా ఆరుగురు కంటే ఎక్కువగా ఒకచోట గుమిగూడవద్దు. అందరూ నిబంధనలు పాటిస్తే ఐసోలేషన్ లో ఉంటే ఆర్థికంగా ఇబ్బంది పడతామనే పరిస్థితులే రావని' ఆయన సూచించారు.


అధికారులు వాయువ్య ఉత్తర మధ్య ఇంగ్లాండ్ లలో నిబంధనలు అమలు చేస్తున్నారు. ఆంక్షలు అతిక్రమిస్తే 1000 పౌండ్ల జరిమానా కాగా పదే పదే ఉల్లంఘించినా అంతర్జాతీయ ప్రయాణాలు చేసి క్వారంటైన్ లో ఉండకపోయినా జరిమానా 10 000 పౌండ్లు విధిస్తామని అధికారులు తెలిపారు. కాగా క్వారంటైన్ లో ఉన్నపుడు ఇంటి నుంచి పనిచేసుకోలేని వారికి ప్రభుత్వం 500 పౌండ్లు చెల్లిస్తోంది. రెండో దశ కరోనా అన్ని దేశాలకు ప్రబలితే ప్రాణ నష్టం పెరగడంతో పాటు ఆర్థిక వ్యవస్థలు చిన్నా భిన్నం అయ్యే పరిస్థితి ఉంది.

Tags :

Advertisement