Advertisement

గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం ...పది మంది మృతి

By: Sankar Wed, 18 Nov 2020 11:09 AM

గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం ...పది మంది మృతి


గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వివరాలు.. బుధవారం తెల్లవారుజామున వడోదర శివారులో వాఘోడియా క్రాస్‌రోడ్డు సమీపంలోని వంతెనపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

ప్రయాణికులతో సూరత్‌ నుంచి పావగఢకు వెళ్తున్న ట్రక్కు వాఘోడియా వద్ద మరో ట్రక్కును ఢీకొట్టింది. వేకువజామున ప్రమాదం జరగడంతో అక్కడ భారీ ఎత్తున ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.

ఈ ప్రమాదంలో పది మంది మరణించగా.. 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై గుజరాత్‌ ముఖ్యమంత్రి సీఎం విజయ్‌ రుపానీ విచారం వ్యక్తం చేశారు. బాధితులకు ఆదుకోవడానికి అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు

Tags :

Advertisement