Advertisement

మెటబాలిజం ని బూస్ట్ చేసే కుండలో నీరు

By: chandrasekar Wed, 27 May 2020 3:44 PM

మెటబాలిజం ని బూస్ట్ చేసే కుండలో నీరు


వేసవి కాలంలో కుండలో నీళ్ళు తాగడం మనకి కొత్తేమీ కాదు. కొద్దిగా మర్చిపోయామంతే. అందులో నీళ్ళ రుచీ, ఆ నీళ్ళ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలూ ఒక్క సారి గుర్తు చేసుకున్నామంటే మళ్ళీ కుండ కొని తెచ్చేసుకుంటాం. సహజం గా నీటిని చల్లబరిచి తాగుతాం. ఆయుర్వేదం లో కుండ లో చల్లబరిచి నీళ్ళ గురించి ఎన్నో మంచి విషయాలు ఉన్నాయి. కుండలో నీళ్ళు చల్లబడడంతో పాటూ మినరల్స్, విటమిన్స్‌ని కలిగి ఉంటాయి. అందుకే, ఫ్రిజ్ లో చల్లబరిచిన నీటి కంటే కూడా కుండ లో చల్లబరిచిన నీటికి విలువ ఎక్కువ.

* మెటబాలిజంని బూస్ట్ చేస్తుంది

ప్లాస్టిక్ బాటిల్స్ లో నీళ్ళు ఉంచడం ఆరోగ్యానికి మంచిది కాదని మనందరికీ తెలుసు. ప్లాస్టిక్ లో బీపీఏ లాంటి టాక్సిక్ కెమికల్స్ ఉంటాయి. కానీ, మట్టి కుండ లో ఎలాంటి కెమికల్సూ ఉండవు. పైగా, ఆ నీరు మెటబాలిజం ని బూస్ట్ చేస్తుంది. పైగా అందులో ఉండే మినరల్స్ వల్ల జీర్ణ సమస్యలు దూరం అవుతాయి.

water,pot,boosts,metabolism,healthy ,మెటబాలిజం, బూస్ట్, చేసే, కుండలో, నీరు


* నీటిని సహజంగానే చల్లబరుస్తుంది

కుండ లో నీళ్ళు ఉంచడం లో ఒక పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే అది వేపరైజేషన్ పద్ధతిలో నీటిని సహజం గా చల్లగా చేస్తుంది. కుండకి ఉన్న చిన్న చిన్న రంధ్రాల వల్ల అందులోని నీటికి హీలింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. అందుకే ఫ్రిజ్‌లో పెట్టిన నీరు కంటే కుండలో చల్లబరిచిన నీటిని తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది.

* వడ కట్టకుండానే

వడ కట్టకుండా ఉండటానికి ఇంత కంటే చక్కటి, చల్లటి మార్గం ఏముంది చెప్పండి? నీళ్ళు ఫ్రిజ్ లో అయినా చల్ల బడతాయేమో కానీ ఆ నీళ్ళు వడ కట్టవు. ఒక్క వడ దెబ్బ నుంచే కాదు, సమ్మర్ లో వచ్చే రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి కుండలో నీళ్ళు మనని రక్షిస్తాయి. అతి దాహం, ఒళ్ళు పేలడం వంటివి కుండ లో నీళ్ళు తాగితే రావు. ఎందుకంటే, అందులో నీళ్ళు చల్లగా ఉండడమే కాదు, అవి శరీరాన్ని లోపలి నుంచి చల్లబరుస్తాయి.

water,pot,boosts,metabolism,healthy ,మెటబాలిజం, బూస్ట్, చేసే, కుండలో, నీరు


* ఎసిడిటీని కంట్రోల్ చేస్తాయి

మట్టి కుండ నీటికి ఉన్న పీహెచ్ బాలెన్స్ ని మెయింటెయిన్ చేస్తుంది. అందువల్ల ఈ నీటిని తాగితే ఎసిడిటీ లాంటి గాస్ట్రిక్ ప్రాబ్లంస్ రాకుండా ఉంటాయి. రెగ్యులర్‌గా తాగడం వల్ల మరెన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ దూరం అవుతాయి. అంతేకాదు, ఇది అందరికీ అందుబాటు ధరలో ఈజీగా దొరుకుతుంది.. అందుకే రెగ్యులర్‌గా ఈ నీటిని తాగడం చాలా మంచిది.

* జలుబు చేయదు

కుండలో ఉన్న నీళ్ళు చల్లగా ఉండటమే కాదు, జెంటిల్ గా కూడా ఉంటాయి. అందుకని ఫ్రిజ్ లో నీళ్ళ లాగా ఇవి తాగితే దగ్గూ, జలుబూ రావు. ఆస్తమాతో బాధపడేవారికి ఈ నీటి వల్ల ఆ ప్రాబ్లం ఎక్కువ అవ్వకుండా ఉంటుంది. పైన చెప్పినవాటి ప్రకారం మనకి కుండ ఎలా మేలు చేస్తుందని తెలుసుకున్నాం కానీ, అవి మాత్రమే కాదు మరిన్ని లాభాలు కూడా ఉన్నాయి. కుండ ని ఎంచుకోవడం వల్ల మనం వాతావరణానికి మేలు చేస్తున్నాం. ఫ్రిజ్ లో నీళ్ళు వదిలేసి కుండ లో నీళ్ళు తాగుదాం. మర్చిపోయిన మన చిన్నతనాన్ని గుర్తుకు తెచ్చుకుందాం.

Tags :
|
|
|

Advertisement