Advertisement

కరివేపాకు తినడం వల్ల ఉపయోగాలు

By: chandrasekar Mon, 25 May 2020 5:10 PM

కరివేపాకు తినడం వల్ల ఉపయోగాలు


కరివేపాకు రోగ నిరోధకశక్తిని పెంచుతుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కరివేపాకు పొడిలో ఉండే పీచు మధుమేహాన్ని నియంత్రిస్తుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. కంటి సమస్యలు ఉన్నవాళ్లకు, దృష్టిలోపం పెరగకుండా ఉండటానికి ఇది చాలా మంచిది. ఇంకా కరివేపాకు కాలేయ సమస్యలను తగ్గిస్తుంది.

బ్యాక్టీరియల్‌, వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు రాకుండా చేస్తుంది. ఆకులను మెత్తగా నూరి గడ్డలు, పొక్కులకు పైపూతగా వాడొచ్చు. దీంట్లోని అమైనో ఆమ్లాలు గుండె కండరాలకు మేలు చేస్తాయి. అలాంటి కరివేపాకు ఆకులను నీడలో ఎండబెట్టి వాడాలి. కరివేపాకు పొడిలో రెండు నిమ్మకాయలు పిండి, కాస్త ఉప్పు, కారం వేసి చివరగా తాలింపు వేసుకుంటే అన్నం, ఇడ్లీల్లోకి చాలా బాగుంటుంది. ఇంకా మానసిక ఒత్తిడి, నరాల బలహీనతను కరివేపాకు తగ్గిస్తుంది. ఒత్తిడిని తగ్గించుకోవడానికి కరివేపాకు పొడిని రోజూ తీసుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

uses,of,curry,eating,iron ,కరివేపాకు, తినడం, వల్ల, ఉపయోగాలు, రోగ


కరివేపాకును ఏదో ఒక రకంగా రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల అనీమియాను నివారిస్తుంది. ఇది పురాతన కాలం నుండి ఉపయోగిస్తున్న బెస్ట్ గ్రాండ్ మదర్స్ చిట్కా. కరివేపాకులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది బ్లడ్ లో ఐరన్ ను ప్రోత్సహిస్తుంది. ఆక్సిజన్ సప్లై చేయడానికి గ్రేట్ గా సహాయపడుతుంది.

జీర్ణశక్తిని పెంచడంలో కరివేపాకు గ్రేట్ గా సహాయపడుతుందని నమ్ముతారు, అలాగే శరీరంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ మరియు ఫ్యాట్ ను కరిగిస్తుంది. కాబట్టి, బరువు తగ్గించుకోవడానికి, జీర్ణశక్తిని పెంచుకోవడానికి కరివేపాకును హోం రెమెడీగా ఉపయోగించుకోవచ్చు . ఇది జీర్ణశక్తిని పెంచుతుంది. బరువు కూడా తగ్గిస్తుంది. కరివేపాకుతో తయారుచేసిన జ్యూస్ లేదా పేస్ట్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం, మజ్జిగలో మిక్స్ చేసి తీసుకోవడం వల్ల కొవ్వు కరిగించుకోవడంతో పాటు, బరువు తగ్గించుకోవచ్చు.

Tags :
|
|
|
|

Advertisement