Advertisement

  • ఘాటైన పచ్చి మిర్చిలో ఘనమైన ప్రయోజనాలు ఎన్నో ..!

ఘాటైన పచ్చి మిర్చిలో ఘనమైన ప్రయోజనాలు ఎన్నో ..!

By: Sankar Sun, 13 Sept 2020 1:46 PM

ఘాటైన పచ్చి మిర్చిలో ఘనమైన ప్రయోజనాలు ఎన్నో ..!


సాధారణంగా మిరపకాయ అంటే చాలామంది భయపడిపోతారు. కారంగా ఉంటుంది. తినలేమంటూ వంటలో వాడినా పక్కన పడేస్తుంటారు. పచ్చి మిరపకాయలను నిత్యం మనం అనేక కూరల్లో వేస్తుంటాం. ఎండు కారంకు బదులుగా వీటిని కారం కోసం చాలా మంది కూరల్లో వేస్తారు. పచ్చి మిరప వల్ల కూరలకు చక్కని రుచి వస్తుంది. ఈ క్రమంలోనే కొందరు పచ్చి మిరప కాయలను అలాగే డైరెక్ట్‌గా తింటారు.నిజానికి పచ్చి మిరపకాయలు కారంగా ఉన్నప్పటికీ వాటిని రోజువారీ ఆహారంలో తీసుకోవడం వల్ల మనకు అనేక లాభాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. మిరపకాయల్లోని క్యాస్పేసియన్ రసాయనం వల్లే మిర్చిని తింటే మంట పుడుతుంది. ఇది మెదడులోని హైపోథాలమస్ అనే కేంద్రాన్ని ప్రేరేపించడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది.

2. పచ్చి మిరపకాయ జీర్ణశక్తిని పెంచుతుంది. అజీర్తిని తొలగిస్తుంది. పక్షవాతాన్ని తగ్గిస్తుంది. రక్తస్రావాన్ని అరికడుతుంది. మిరపకాయ రుచిని కలిగించడమే కాకుండా ఆకలిని వృద్ధి పరుస్తుంది. కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది. దెబ్బ తగిలినపుడు కారే రక్తాన్ని కూడా తగ్గించే శక్తి కారానికి ఉంది.

3. మిరపకాయ గింజలను నువ్వుల నూనెలో కాగబెట్టి, పూతగా రాస్తుంటే కీళ్ల నొప్పులు, నడుము నొప్పులు తగ్గుముఖం పడతాయి. ఒక గ్లాసు నీటిలో గులాబీ పూలు రెండు పచ్చిమిరపకాయలు ఉడికించి ఆ నీటిని పుక్కిలలిస్తే గొంతు నొప్పికి అద్భుతంగా పనిచేస్తుంది.

4. దగ్గు, జలుబు, ఫ్లూ జ్వరం ఉన్నవారు పచ్చిమిరపను బాగా తీసుకుంటే ఆయా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ముక్కు దిబ్బడ ఉంటే ముక్కు ద్వారాలు క్లియర్ అవుతాయి. గాలి బాగా పీల్చుకోవచ్చు.పచ్చి మిరపకాయల్లో యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉంటాయి. అందువల్ల ఇవి చర్మ సమస్యలను పోగొడతాయి.

5. పచ్చి మిరపకాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను ఎప్పటికప్పుడు బయటకు పంపిస్తాయి. దీంతో క్యాన్సర్ నుంచి రక్షణ లభిస్తుంది. ప్రొస్టేట్ గ్రంథి సమస్యలకూ పచ్చి మిర్చి మంచి మందులా పనిచేస్తుందట.

6. సైనస్‌ సమస్య ఉన్నవారికి పచ్చి మిరపను మించిన ఔషధంలేదు. ముక్కులోపలి మ్యూకస్ మెంబ్రేన్లలో మ్యూకస్ ఏర్పడడాన్నే సైనస్‌గా చెబుతుంటారు. మిర్చిలో ఉండే క్యాప్సేసియన్ వల్ల మెంబ్రేన్లకు రక్తసరఫరా బాగా జరిగి, అందులో మ్యూకస్ ఏర్పడకుండా చూస్తుంది. దీంతో సైనస్ నుంచి ఉపశమనం లభిస్తుంది.



Tags :
|
|

Advertisement