Advertisement

తెలంగాణాలో కరోనా 2,296 కేసులు...10 మరణాలు

By: Anji Wed, 23 Sept 2020 12:12 PM

తెలంగాణాలో కరోనా 2,296 కేసులు...10 మరణాలు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 2,296 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 1,77,070 కు చేరింది. 24 గంటల్లో 10 మంది కరోనా బారిన పడి మరణించగా.. మృతుల సంఖ్య 1,062కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 29,873 యాక్టివ్‌ కేసులు ఉన్నట్టు ప్రభుత్వం పేర్కొంది.

జిల్లాల వారీగా కేసులు చూస్తే.. జోగులమ్మ గద్వాల్‌ 21, కామారెడ్డి 77, కరీంనగర్‌ 136, ఖమ్మం 69, కొమరం భీమ్‌ అసిఫాబాద్‌ 16, మహబూబ్‌ నగర్‌ 31, మహబూబాబాద్‌ 72, మంచిర్యాల్‌ 37, మెదక్‌ 23, మేడ్చల్ మల్కాజ్‌గిరి 173, ములుగు 24, నాగర్‌ కర్నూల్‌ 36, జీహెచ్‌ఎంసీ పరిధిలో 321, ఆదిలాబాద్ 18, భద్రాద్రి కొత్తగూడెం 77, జగిత్యాల్‌ 50, జనగాం 36,

జయశంకర్ భూపాలపల్లి 11, నల్గొండ 155, నారాయణ్‌పేట్‌ 6, నిర్మల్‌ 19, నిజామాబాద్‌ 82, పెద్దంపల్లి 40, రాజన్న సిరిసిల్ల 67, రంగారెడ్డి 217, సంగారెడ్డి 81, సిద్ధిపేట్‌ 92, సూర్యాపేట 73, వికారాబాద్‌ 23, వనపర్తి 37, వరంగల్‌ రూరల్‌ 30, వరంగల్‌ అర్బన్‌ 99, యాద్రాది భువనగిరి 47 కేసులు నమోదయ్యాయి.

Tags :

Advertisement