Advertisement

తెలంగాణలో భారీగా కరోనా కేసులు..10 మరణాలు

By: Anji Thu, 24 Sept 2020 09:55 AM

తెలంగాణలో భారీగా కరోనా కేసులు..10 మరణాలు

తెలంగాణలో కొత్తగా 2,296 కరోనా కేసులు నమోదు చేశారు. గడిచిన 24 గంటల్లో కరోనాతో 10 మంది మృతి చెందగా.. తెలంగాణలో కరోనా కేసులు 1,77,070కు చేరుకున్నాయి. 1,062 మరణాలు చోటు చేసుకున్నాయి.

ప్రస్తుతం తెలంగాణలో 29,873 యాక్టివ్ కేసులున్నాయి. 1,46,135 మంది రికవరీ అయ్యారు. తెలంగాణలో ఇప్పటివరకు 26.28 లక్షల కరోనా టెస్టుల నిర్వహించారు. కొత్తగా జీహెచ్ఎంసీ 321, రంగారెడ్డి 217, మేడ్చల్‌లో 173 కేసులు నమోదు చేశారు.

Tags :
|

Advertisement