Advertisement

  • ఉద్యోగం చేసే ప్రెగ్నెన్సీ మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ..

ఉద్యోగం చేసే ప్రెగ్నెన్సీ మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ..

By: Sankar Wed, 15 July 2020 12:36 PM

ఉద్యోగం చేసే ప్రెగ్నెన్సీ మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ..



ఆడవారి జీవితంలో తల్లి కావడం అనేది ఒక మధురమైన విషయం ..ఈ సృష్టిలో తల్లిని మించిన గొప్ప వారు ఇంకొకరు ఉండరు అంటారు ..అందుకే ఆడపిల్ల తల్లి అయితుంది అంటే అనేక జాగ్రత్తలు తీసుకుంటారు ..అయితే ఇంటి దగ్గర ఉండేవారికి అయితే పెద్దగా ఇబ్బంది ఉండదు గాని ఉద్యోగం చేసే మహిళలు మాత్రం చాల జాగ్రత్తలు తీసుకోవాలి ..అయితే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూదాం ..

1. ఈ సమయంలో మహిళలకు చాలా ఇష్టమైన పదార్థాలపైనా కూడా ఒక్కోసారి వికారం పుట్టొచ్చు. వాటిని ఇంతకుముందు ఎంతో ఇష్టంగా తీసుకున్నా.. ఇప్పుడు వాటిపై వికారంగా ఉంటుంది. ఇలాంటి సమయంలో చిరుతిళ్లు తినండి..ఆఫీసులో సులభంగా తినటానికి చిరుతిళ్ళను ముందు నుండే పెట్టి ఉంచుకోండి. అల్లం టీ వికారాన్ని తగ్గిస్తుంది.

2. గర్భ సమయంలో మీకు త్వరగా అలసట అనిపిస్తుంది. ఆఫీసులో ఉన్నప్పుడు విశ్రాంతి తీసుకోవటం కష్టం కాబట్టి..ఐరన్, ప్రొటీన్ ఎక్కువ ఉన్న ఆహారాన్ని తీసుకోండి. ఐరన్ లోపంతో అలసట వస్తుంది. అదేవిధంగా రక్తహీనత కూడా మరో లక్షణం. వీటిని తగ్గించుకునేందుకు మీరు మంచి పోషకాహారం తీసుకోవాలి. ఎర్రని మాంసం, గుడ్లు, సీ ఫుడ్, ఆకుకూరలు, ఐరన్ ఉండే ధాన్యాలు, చిక్కుళ్లు తీసుకోండి.

3. కూర్చోకుండా అప్పుడప్పుడు లేవాలి. లేచి నిలబడి కాసేపు అటూ ఇటూ తిరగడం వలన మీకు ఓపిక వస్తుంది. కొన్ని నిమిషాలు కళ్ళు మూసుకోవటం, పాదాలను కాస్తా ఎత్తులో పెట్టుకోవటం వల్ల అలసట తగ్గి ఉత్సాహం వస్తుంది.

4. ప్రెగ్నెన్సీ సమయంలో కొంత వర్కవుట్ చేయడం మంచిది. అయితే, ఉద్యోగినులకు అంత టైమ్ ఉండకపోవచ్చు. రోజంతా పనిచేశాక..వర్కవుట్ అనేది ఇబ్బందిగా ఉంటుంది. అయితే, శారీరక వ్యాయామం వల్ల మీ ఒంట్లో ఓపిక పెరుగుతుంది – ముఖ్యంగా రోజంతా డెస్క్ వద్ద కూచునే వుండేవారికి మరింత ముఖ్యం. ఆఫీసు అనంతరం నడుస్తూ వెళ్లండి. అదే విధంగా.. వైద్యుల సలహా మేరకు కొన్ని ఎక్సర్‌సైజెస్ చేయడం లేదా ఫిట్‌నెస్ క్లాసులో చేరడం వంటివి చేయండి.

5. కొన్ని పనులను తగ్గించుకోవటం వల్ల మీకు ఎక్కువ విశ్రాంతి దొరుకుతుంది. అంటే నేరుగా షాపింగ్ చేయకుండా..ఆన్లైన్‌లో చేయొచ్చు. ఇంటి పనులు, తోట పనులు ఇలాంటి వాటి కోసం సాయం తీసుకోవడం చేయొచ్చు.

6. ప్రెగ్నెన్సీ సమయంలో ఎక్కువ లిక్విడ్స్ తీసుకోవడం మంచిది. అందుకే.. మీ డెస్క్, పనిచేసేచోట ఒక వాటర్ బాటిల్ పెట్టుకుని మధ్య మధ్యలో తాగండి. ఇవే కాకుండా కొబ్బరి నీళ్లు, జ్యూసెస్, మజ్జిగ తీసుకోవడం మంచిది. అయితే, అన్ని పండ్లని జ్యూస్‌గా తీసుకోకూడదు. వైద్యుల సలహా మేరకే తీసుకోవాలి.

Tags :
|
|

Advertisement