Advertisement

సీతాఫలంలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

By: chandrasekar Mon, 27 July 2020 8:16 PM

సీతాఫలంలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు


ఇప్పటి లాగా మునుపెన్నడు ఇంతగా ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టిన దాఖలాలు లేవు. హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే మెడిసిన్స్ తీసుకోవచ్చులే అనే ధైర్యంతో ఉండేవారందరూ కూడా మెడిసిన్ లేని ఈ వ్యాధికి రూట్ మార్చుకుంటున్నారు. ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటే కరోనా వైరస్ దరిచేరదు అన్న విషయం తెలిశాక అందరూ ఒక్క సారిగా హెల్త్ కాన్షియస్ అయిపోయారు. ఇప్పుడు అందరం ఇమ్యూనిటీని పెంచే ఫుడ్స్ గురించి తెలుసుకోవడం మొదలుపెట్టాం.

హెల్దీ లైఫ్ స్టైల్ కి అలవాటు చేసుకోవడం మొదలుపెట్టాం. అలాంటి హెల్దీ ఫుడ్స్ లో ఒకటి సీతా ఫలం. ఇది సీతా ఫలాలు వచ్చే కాలం. ఏ కాలం లో వచ్చే పండ్లూ కూరగాయల్ని ఆ కాలంలో తీసుకోవడం వల్ల సీజనల్ ప్రాబ్లమ్స్ నుంచి తప్పించుకోవచ్చని నిపుణులు అంటున్నారు. సీజనల్ ప్రాబ్లమ్స్ తగ్గించడమే కాకుండా సితాఫలంలో ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.

* సీతాఫలంలో ఉండే ఫైబర్, మినరల్స్ వల్ల ఈ పండు అరుగుదలకి తోడ్పడుతుంది. బౌల్ మూమెంట్‌కి సహకరిస్తుంది. తద్వారా, గ్యాస్, కాన్స్టిపేషన్ వంటి సమస్యలు దూరమౌతాయి. అంతే, కాకుండా డయేరియా లాంటి ప్రాబ్లంస్ కి కూడా ఈ పండు చెక్ పెడుతుంది.

* సీతాఫలం చాలా రుచిగా ఉంటుంది. సమతులాహారానికి ఉదాహరణగా ఈ పండుని చెబుతారు. ఇందులో కాలరీస్, ప్రోటీన్, ఫ్యాట్, ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్ఫరస్ వంటివన్నీ సరైన క్వాంటిటీలో ఉంటాయి.

* సీతాఫలంలో విటమిన్స్ సమృద్ధిగా ఉంటాయి. ఈ విటమిస్న్ వయసు మీద పడకుండా చేస్తాయి. ఈ పండులో ఉండే యాంటీ-ఏజీయింగ్ ప్రాపర్టీస్ వలన స్కిన్ మంచి గ్లో తో ఉంటుంది. ఈ పండు ఫ్రీ రాడికల్స్ తో పోరాడి సెల్స్ ని స్ట్రాంగ్ గా ఉంచుతుంది. సీతా ఫలాన్ని అలాగే తినచ్చు. కానీ, కొత్త రెసిపీస్ ట్రై చేద్దాం అనుకునే వారి కోసం ఇక్కడొక మంచి స్మూతీ రెసిపీ ఉంది, ట్రై చేయండి.

* చాలా రకాల పండ్ల లాగానే సీతా ఫలం లో కూడా శరీరాన్ని చల్లబరిచే గుణాలున్నాయి. ఇండియా లాంటి ట్రాపికల్ కంట్రీలో వానలు పడుతున్నా కూడా వేడి తగ్గదు. ఈ పండు బాడీ యోక్క నాచురల్ టెంపరేచర్ ని మెయింటెయిన్ చేస్తుంది. ఎక్కువ ఉన్న వేడిని బైటికి పంపేస్తుంది.

* సీతాఫలం చూడడానికి కూడా హృదయాకారంలో ఉంటుంది. అందుకే ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. శరీరమంతా రక్తప్రసరణ సరిగ్గా ఉండేలా చూస్తుంది. అందువల్ల రక్తహీనత / ఎనీమియా దరి చేరదు. ఇందులో ఉండే ఐరన్ వల్ల ఆర్టరీస్ హెల్దీ గా ఉంటాయి. హీమోగ్లోబిన్ లెవెల్స్ కూడా సరిగ్గా ఉంటాయి.

Tags :
|

Advertisement