Advertisement

మ‌ధ్యాహ్నం నిద్ర‌పోవ‌డం వ‌ల్ల కలిగే లాభాలు

By: chandrasekar Sat, 27 June 2020 6:12 PM

మ‌ధ్యాహ్నం నిద్ర‌పోవ‌డం వ‌ల్ల కలిగే లాభాలు


పూర్వం పెద్ద‌వాళ్లు మ‌ధ్యాహ్నం భోజ‌నం చేశాక కొంచెం సేపు అలా కునుకు తీస్తారు (నిద్ర చేస్తారు). అలా చేస్తే ఉత్సాహంతో పాటు ఎన‌ర్జీ వ‌చ్చిన‌ట్లు ఉంటుంది ఆపై మ‌ర‌లా ప‌నిలో లీన‌మైపోవ‌చ్చు అన‌డం చాలాసార్లు విన్నాం. తిన్న త‌ర్వాత అలా నిద్ర‌పోతే లావెక్కుతారు దీంతోపాటు రాత్రి నిద్ర ప‌ట్ట‌ద‌ని కూడా అంటుంటారు. అది నిజ‌మో అబద్ద‌మో తెలియ‌దు కాని చాలామంది పాటిస్తారు. ఈ విష‌యంపై పూర్తి క్లారిటీ ఇస్తామంటున్నారు న్యూట్రిషనిస్ట్‌లు. వీరు చెపుతున్న విషయాలు ఏమిటో కొంచం వివరంగా చూస్తాం.

మ‌ధ్యాహ్నం నిద్ర‌పోవ‌డం వ‌ల్ల కలిగే లాభాలు:

* నిద్ర‌పోవ‌డం వ‌ల్ల హార్మొన్ల స‌మ‌తుల్య‌త పెరుగుతుంది. దీంతో డ‌యాబెటిస్, పీసీఓడీ, థైరాయిడ్ స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట‌ప‌డొచ్చు అంటున్నారు.

* మ‌ధ్యాహ్న నిద్ర‌ వ‌ల్ల జీర్ణ‌క్రియ మెరుగ‌వుతుంది.

* హైబీపీని నియంత్రించ‌డంలో మ‌ధ్యాహ్నం నిద్ర స‌హాయ‌ప‌డుతుంది.

* కొవ్వును క‌రిగించ‌డానికి మెరుగ్గా ప‌నిచేస్తుంది.

* మ‌ధ్యాహ్నం నిద్ర‌పోవ‌డం వ‌ల్ల రాత్రివేళ‌లో కూడా కంటినిండా నిద్ర వ‌స్తుంది.

* ఇది స్థూల‌కాయ స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డేలా చేస్తుంది.

* అంతేకాకుండా అనారోగ్యం నుంచి కోలుకునేందుకు ఉపకరిస్తుంది.

చిన్న‌పిల్ల‌లు, వృద్ధుల‌యితే 90 నిమిషాల‌పాటు నిద్ర‌పోవాలి. ఆరోగ్య‌వంతుల‌యితే 10 నుంచి 30 నిమిషాలు కునుకు తీయ‌డం ఆరోగ్యానికి మంచిది. ప‌డుకోవ‌డం కూడా ఒక సైడ్‌కి ముడుచుకొని ప‌డుకోవాలి. ఎడ‌మ‌వైపు తిరిగి నిద్రిస్తే ప్ర‌యోజ‌నం ఉంటుంది. మ‌ధ్యాహ్నం 1 నుంచి 3 గంట‌ల మ‌ధ్య స‌మ‌యంలో నిద్ర‌పోవాల‌ని సూచించారు.

Tags :
|

Advertisement