Advertisement

  • గుండె పోటు రావడానికి ముందు కనిపించే లక్షణాలు మరియు తీసికోవలసిన జాగ్రత్తలు

గుండె పోటు రావడానికి ముందు కనిపించే లక్షణాలు మరియు తీసికోవలసిన జాగ్రత్తలు

By: chandrasekar Tue, 30 June 2020 6:02 PM

గుండె పోటు రావడానికి ముందు కనిపించే లక్షణాలు మరియు తీసికోవలసిన జాగ్రత్తలు


గుండె నొప్పి వచ్చే ముందు శరీరం కొన్ని సంకేతాలు ఇస్తుంది. వీటిని తెలుసుకుంటే మృత్యువును జయించవచ్చునాని వైద్యులు సూచిస్తున్నారు. గుండె నొప్పి లేదా గుండె పోటు ఎప్పుడు ఎలా వస్తుందో తెలీదు. కానీ, ఒక్కసారి వచ్చిందంటే మరణమే. అత్యవసర చికిత్స అందించినా లేదా అదృష్టం ఉంటే మాత్రం బతికి బయటపడవచ్చు. అయితే, ఇతర వ్యాధులతో పోల్చితే గుండె పోటును ముందుగానే గుర్తించి అప్రమత్తయ్యేందుకు అవకాశం ఉంటుంది. గుండె పోటుకు ముందు శరీరం కొన్ని సంకేతాలను ఇస్తుంది. అవేమిటో తెలిస్తే మీరు తప్పకుండా గండం నుంచి తప్పించుకోవచ్చు.

మనిషి లో గుండెకు నిరంతరాయంగా రక్తం సరఫరా అవుతూ ఉండాలి. సరఫరా ఏ మాత్రం నిలిచినా శరీరంలోని మొత్తం వ్యవస్థ స్తంభించిపోతుంది. గుండెకు రక్త సరఫరా నిలిచిపోవడానికి ప్రధాన కారణం కొవ్వులే. రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల గోడల్లో కొవ్వు పేరుకుపోతుంది. దీంతో రక్తం ప్రవహించే మార్గం కుచించుకుపోతుంది. దీనివల్ల గుండెకు రక్తసరఫరా నిలిచిపోతుంది. ఫలితంగా గుండె కండరాలకు ఆక్సిజన్, పోషకాలు అందవు. దీంతో కండరాలు చచ్చుబడి గుండె పోటు ఏర్పడుతుంది.

గుండె పోటుకు రావడానికి ముందు కనిపించే లక్షణాలు:

* గుండె నొప్పికి ముందు శ్వాస తీసుకోవడం కష్టంగా అనిపిస్తుంది. గాలి పీల్చుకోలేక ఇబ్బంది పడతారు. ఈ లక్షణం కనిపిస్తే తప్పకుండా అప్రమత్తం కావాలి.

* మాట్లాడేటప్పుడు గందరగోళానికి గురికావడం, చెప్పాలనుకొనే విషయాన్ని చెప్పలేకపోవడం, ఒకే విషయాన్ని ఎక్కువసార్లు చెప్పడం వంటి సూచనలను కూడా గుండెపోటుకు సంకేతాలుగా భావించాలి.

* రక్త సరఫరా తగ్గినట్లయితే గుండెల్లో మంటగా ఉంటుంది. ఈ లక్షణం కనిపిస్తే వెంటే వైద్యుడిని సంప్రదించాలి.

* తరచుగా జలుపు, జ్వరం, దగ్గు వస్తున్నా.. అవి ఎంతకీ తగ్గకపోయినా అనుమానించాలి. ఈ లక్షణాలు కూడా గుండె నొప్పికి సూచనలే.

* గుండె భారంగా.. అసౌకర్యంగా అనిపిస్తే వైద్యుడిని సంప్రదించాలి.

* మత్తు లేదా మగతగా ఉన్నా, చెమటలు ఎక్కువగా పడుతున్నా గుండె నొప్పికి సూచనగా అనుమానించాలి.

* తీవ్రమైన అలసట, ఒళ్లు నొప్పులు వస్తున్నా అశ్రద్ధ చేయకూడదు.

* వికారం, ఆహారం జీర్ణం కాకపోవడం, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు కూడా గుండెనొప్పికి దారితీస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

* కంటి చివరిలో కురుపులు ఏర్పడినా నిర్లక్ష్యం వద్దు. అవి గుండె పోటుకు దారితీయొచ్చు.

* కాళ్లు, పాదాలు, మడమలు ఉబ్బుతున్నట్లయితే గుండె పోటుగా అనుమానించాలి.

* శరీరం పై భాగం నుంచి ఎడమ చేతి కింది వరకు నొప్పిగా అనిపిస్తే తప్పకుండా గుండె నొప్పి రాబోతుందని గుర్తించాలి.

* కొందరికి దవడలు, గొంతు నొప్పులు కూడా గుండె నొప్పికి సంకేతాలు.

గుండె సమస్యలుంటే తప్పకుండా హార్ట్ బీట్‌ను చెక్ చేసుకోవాలి. అసాధారణంగా గుండె కొట్టుకున్నట్లు అనిపిస్తే వైద్యుడిని సంప్రదించాలి. ఆరు నెలలకు ఒక సరి ఈసీజీ టెస్ట్ చేయించడం వల్ల తగు జాగ్రత్తలు పాటించవచ్చు.

Tags :
|
|

Advertisement