Advertisement

సూట్ రూమ్ కోసం అలిగిన సురేష్ రైనా

By: chandrasekar Tue, 01 Sept 2020 4:54 PM

సూట్ రూమ్ కోసం అలిగిన సురేష్ రైనా


ఐపీఎల్ 2020 సీజన్‌ కోసం యూఏఈకి చేరుకున్న చెన్నై జట్టులో 13 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవడంతో రోజు వ్యవధిలోనే సురేశ్ రైనా టోర్నీ నుంచి వెళ్ళిపోయాడు. దాంతో.. కరోనా వైరస్ భయంతోనే రైనా ఇంటికి వచ్చేశాడని వార్తలు వినిపించాయి. మరోవైపు అతని మేనత్త కుటుంబంపై దుండగులు దాడి కారణంగా భారత్‌కి వచ్చేసినట్లు వార్తలు కూడా వినిపించాయి. అయితే.. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీతో రూము కేటాయింపు విషయంలో రైనా గొడవపడి ఇంటికి వచ్చేసినట్లు వెలుగులోకి వచ్చింది. సెప్టెంబరు 19 నుంచి ఐపీఎల్ 2020 సీజన్ ప్రారంభంకానుండగా.. ఆగస్టు 21న యూఏఈకి చేరుకున్న చెన్నై సూపర్ కింగ్స్ టీమ్.. ఆరు రోజుల క్వారంటైన్‌లో ఉంది. ఆ సమయంలో ఆటగాళ్లకి కేటాయించిన రూములపై రైనా గొడవపడినట్లు తెలుస్తోంది.

సాధారణంగా టీమ్ హెడ్ కోచ్, కెప్టెన్, మేనేజర్‌కి హోటల్‌లో సూట్‌ని కేటాయిస్తారు. అయినప్పటికీ టీమ్ వైస్ కెప్టెన్‌గా ఉన్న సురేశ్ రైనాకి కూడా చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ సూట్‌ని కేటాయించింది. కానీ.. రైనాకి కేటాయించిన దానికి బాల్కనీ లేకపోడంతో ఆ విషయమై టీమ్ మేనేజర్‌తో అతను గొడపడినట్లు సమాచారం. మధ్యలో ధోనీ మాట్లాడిన.. సమస్యని రైనా తెగే వరకూ లాగి భారత్‌కి వచ్చేశాడని తెలుస్తోంది. ఐపీఎల్ 2020 సీజన్ నుంచి వ్యక్తిగత కారణాలతో సురేశ్ రైనా వైదొలిగినట్లు తొలుత చెప్పుకొచ్చిన చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ.. క్రమంగా రైనాని దోషిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోంది. చెన్నై టీమ్ యజమాని ఎన్. శ్రీనివాసన్ తాజాగా రైనా గురించి మాట్లాడుతూ ‘‘చెన్నై సూపర్ కింగ్స్‌ టీమ్ ఒక ఫ్యామిలీలా ఉంటుంది. కానీ.. ఎవరైనా అందులో నుంచి వెళ్లాలనుకుంటే.. వారిని బలవంతంగా మేము ఆపబోం’’ అని స్పష్టం చేశాడు. ఐపీఎల్ 2021 సీజన్‌కి సురేశ్ రైనాని వేలంలోకి చెన్నై ఫ్రాంఛైజీ తీసుకునే అవకాశాలు లేనట్లు తెలుస్తోంది.

Tags :
|
|
|

Advertisement