Advertisement

ఇంట్లో రుచి, శుచీకి కొన్ని చిట్కాలు

By: chandrasekar Fri, 17 July 2020 6:17 PM

ఇంట్లో రుచి, శుచీకి కొన్ని చిట్కాలు


* ఇంట్లో సాంబ్రాణి పొగ వేసుకోవడం మంచిది. ఇది ఇంట్లోని దుర్వాసనలు, క్రిమికీటకాలను దూరం చేస్తుంది.

* పుట్టగొడుగులు వండే ముందు పొడి వస్త్రంతో తుడిచి ఆపై ధారలా పడుతున్న నీటితో కడుగి మరోసారి తుడిచి వండుకుంటే రుచిగా ఉంటుంది.

* వంకాయ ముక్కలు నల్లబడకుండా ఉండాలంటే స్పూన్‌ పాలు వేయాలి.

* కేక్‌ కూల్‌ ఉన్నప్పుడు కన్నా లేనప్పుడే టేస్ట్‌ బాగుంటుంది.

* కేక్‌ను ఫ్రిజ్‌లో ఉంచేదానికంటే గాలి చేరని కంటైనర్‌లో ఉంచడం మంచిది.

* బ్రెడ్‌, ఉల్లి, ఆలుగడ్డలను ఫ్రిజ్‌లో పెట్టకూడదు. పెట్టడం వల్ల వెంటనే పాడైపోతాయి.

* కట్‌ చేసిన ఆపిల్‌ ముక్కలను అల్లం నీటిలో వేసినట్లయితే రంగు మారకుండా ఉంటాయి.

* ఒక గిన్నెలో కొంచెం ఉప్పు వేసి కోసిన పండ్ల ముక్కలను వేయాలి. రెండు నిమిషాల తర్వాత తీస్తే పండ్లు బ్రౌన్‌ రంగులోకి మారకుండా తాజాగా కనిపిస్తాయి.

* పాలు విరిగిపోతాయనుకుంటే కాచేటప్పుడు అందులో కొద్దిగా వంటసోడా వేస్తే సరిపోతుంది.

Tags :
|
|

Advertisement