Advertisement

దోమలు తరిమేయడానికి కొన్ని ఇంటి చిట్కాలు

By: chandrasekar Tue, 29 Sept 2020 12:43 PM

దోమలు తరిమేయడానికి కొన్ని ఇంటి చిట్కాలు


దోమలని ఇంట్లో నుంచి తరిమేయడానికి కొన్ని ఇంటి చిట్కాలను వాడొచ్చు. దోమలు చాలా రకాల జ్వరాలకి, ఆరోగ్య సమస్యలకి దోమలు కారణమవుతాయి. వైరల్ ఫీవర్స్, జ్వరాలు, చికెన్ గున్యా, డెంగ్యూ వంటివన్నీ దోమలవల్లే వస్తాయి. వీటిని ఇంటి నుంచి తరిమేసేందుకు మార్కెట్లో అనేక రకాల కాయిల్స్ అందుబాటులోకి వస్తున్నాయి. వీటిని వాడడం వల్ల దోమలు పోతాయా అంటే కాస్తా ఉపయోగం ఉంటుంది. కానీ వాటిలోని కెమికల్స్ వల్ల చిన్నపిల్లలకి ఇబ్బందులు ఎదురవుతాయి.

దోమలని ఇంట్లో నుంచి తరిమేయడానికి కొన్ని ఇంటి చిట్కాలు;

తులసి చెట్లు ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఉంటుంది. ఈ చెట్టు ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. ఇది అనేక సమస్యలు దూరం చేస్తుంది. దోమలని కూడా దూరం చేయడం దీనిలో ఉండే ప్రత్యేక గుణం. అందుకోసం ఏం చేయాలంటే తులసి ఆకులను సేకరించిన నూనె స్ప్రే చేస్తుండాలి.

ఇందుకు వేపనూనె, పసుపు చాలా ఉపయోగ పాడుతాయని నిపుణులు నిర్దారి౦చారు. ఇళ్లలోని నీళ్లతొట్టి, కుళాయిల దగ్గర, మురికి కాలువల దగ్గర 100 లీటర్ల నీటిలో 25 గ్రాముల పసుపు పొడి కలిపి చల్లితే దోమల బాధ ఉండదు. అలాగే వేప నూనెను చల్లవచ్చు.

మన మసాలా దినుసుల్లో లవంగం కూడా కీ రోల్ పోషిస్తుంది. ఆయుర్వేదిక్ షాపుల్లో ఈ ఆయిల్ అమ్ముతుంటారు. ఈ ఆయిల్‌ని అక్కడక్కడ స్ప్రే చేస్తే దోమలు పోతాయి. వెల్లుల్లి కూడా దోమలను దూరం చేసేందుకు పని చేస్తుంది. దోమలని దూరం చేయాలనుకుంటే వెల్లుల్లిని మీ దగ్గర ఉంచుకోవాల్సిందే. ఇది ఆరోగ్యానికి మాత్రమే కాదు దోమలను దూరం చేయడంలోనూ బాగా హెల్ప్ చేస్తుంది.

పిల్లలు గదిలో లేనప్పుడు దోమలను కాయిల్స్ వాడండి. ముఖ్యంగా వాటిని గది తలుపుల దగ్గర పెట్టండి. దీని వల్ల లోపలికి రాకుండా పొగ అడ్డుకుంటుంది. స్ప్రేలు చేయడం చాలా మంచిది. దోమలు కుట్టకుండా నెట్ కూడా వాడొచ్చు. దీనివల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు. నిమ్మ, యూకలిప్టస్ ఆయిల్స్ పిల్లల చర్మానికి అంత మంచివి కావు. అందుకే మూడు సంవత్సరాలలోపు పిల్లలకు వీటిని వాడకపోవడమే మంచిది.

Tags :
|
|
|

Advertisement