Advertisement

  • పాలను కొన్నింటితో కలిపి తీసుకుంటే దుష్ప్రభావాలు

పాలను కొన్నింటితో కలిపి తీసుకుంటే దుష్ప్రభావాలు

By: chandrasekar Wed, 26 Aug 2020 12:09 PM

పాలను కొన్నింటితో కలిపి తీసుకుంటే దుష్ప్రభావాలు


పాలలో మన శరీరానికి కావాల్సిన పోషకాలు అన్నీ ఉంటాయి. దీనిని ముఖ్యమైన పానీయంగా పరిగణిస్తున్నారు. పాలు జీర్ణమైనప్పుడు అన్ని కణజాలాలకు పోషణ అందుతుంది. అందుకే పిల్లలనుంచి పెద్దల వరకూ అందరూ ప్రతిరోజూ గ్లాసు పాలను తప్పనిసరిగా తాగాలని వైద్యులు సూచిస్తారు.

అయితే, ఆయుర్వేదం ప్రకారం పాలను కొన్నింటితో కలిపి తీసుకోవద్దు. ఇలాచేస్తే ఆరోగ్యానికి హాని కలుగుతుందట. అననుకూల పదార్థాలతో కలిపినప్పుడు, పాలు అజీర్తిని కలిగిస్తాయి. శరీరంలో విషపదార్ధాలను ఏర్పరుస్తాయి.

కారకాయ, ముడి ఆకుపచ్చ కూరగాయలు, హెర్బల్ టీ లాంటి చేదు ఆహారాలతో కలిపి తీసుకోరాదు. ఆకుకూరలు, ఆలివ్ లాంటి ఉప్పు ఉన్న ఆహారాలు తీసుకున్నతర్వాత పాలు తాగొద్దు.దానిమ్మ, ముడి అరటి, కాన్‌బెర్రీస్‌, ఓక్రా, ద్రాక్షలాంటి యాస్ట్రింజెంట్‌ ఆహారంతోపాటు పాలు తీసుకోవడం మంది కాదు.

పెసర మొలకలు, రొట్టె, ఇడ్లి లేదా ఏదైనా పులియబెట్టిన ఆహారాలు, నిమ్మకాయలాంటి పుల్లని పదార్థాలు తిన్న వెంటనే పాలు తాగకూడదు. వెల్లుల్లి, ఉల్లిపాయ, వేడి మిరియాలు, ఆవాలు లాంటి తీవ్రమైన పదార్థాలతో పాలను కలపొద్దు. భోజనం చేసిన తర్వాత గంట ఆగి పాలు తాగితే మంచిది.

Tags :
|
|

Advertisement