Advertisement

నాలుక‌ తెలుపు రంగులోకి మారడానికి కారణాలు

By: chandrasekar Mon, 21 Sept 2020 1:08 PM

నాలుక‌ తెలుపు రంగులోకి మారడానికి కారణాలు


కొంతరికి నాలుక తెల్లగా ఉండడానికి కార‌ణం వారు నోటిని శుభ్రం చేసుకోక‌పోవ‌డ‌మే. దీన్ని ఇలానే వ‌దిలేస్తే నాలుక ఎర్ర‌బ‌డ‌డం, వాపు, గ‌డ్డ‌లు వంటి స‌మ‌స్య‌లు మొద‌లవుతాయి. నాలుక మీద ఈ గ‌డ్డ‌లు బ్యాక్టీరియా, ఆహారం, ధూళి, చ‌నిపోయిన క‌ణాల‌ను కూడా ట్రాప్ చేస్తాయి. అస‌లు నాలుక తెల్ల బ‌డ‌డానికి గ‌ల కార‌ణాలు ఏంటో తెలుసుకుందాం.

* జ్వ‌రం వ‌చ్చిన‌ప్పుడు నోరంతా చేదువుగా ఉంటుంది. దీనికి కార‌ణంగా నాలుక తెల్ల‌బ‌డ‌ట‌మే.
* శ‌రీరం డీహైడ్రేట్ అయితే నాలుక కూడా డీహైడ్రేట్‌కు గుర‌వుతుంది. దీని కార‌ణంగా కూడా నాలుక తెల్ల‌గా మారుతుంది.
* బ‌రువు త‌గ్గ‌డం* చ‌ర్మం మీద ద‌ద్దుర్లు ఏర్ప‌డ‌టం.
* ధూమ‌పానం వ‌ల్ల కూడా ఈ ప‌రిస్థితి ఏర్ప‌డుతుంది. అరుదైన సంద‌ర్భాల్లో నోటి క్యాన్స‌ర్‌గా అభివృద్ది చెందే అవ‌కాశం ఉంది.
* నోరంతా ఎండిపోవ‌డం వ‌ల్ల నాలుక తెల్ల‌గా మారుతుంది.
* పొగాకు న‌మ‌ల‌డం, ధూమ‌పానం చేయ‌డం వ‌ల్ల నాలుక ఎక్కువ‌గా తెల్ల‌బ‌డుతుంది.* అధికంగా మ‌ద్యం తాగ‌డం వ‌ల్ల కూడా ఇలా మారుతుంది.
* సాఫ్ట్‌ఫుడ్ తిన‌డం వ‌ల్ల కూడా నాలుక రంగు మారుతుంది.
* నాలుక‌ను వ్య‌తిరేకంగా రుద్ద‌డం వ‌ల్ల కూడా క‌ల‌ర్ చేంజ్ అవుతుంది.
* నాలుక మీద మంట, ఆహారం న‌మ‌ల‌డం, మింగేట‌ప్పుడు, మాట్లాడేట‌ప్పుడు నొప్పి ఉన్న‌ప్పుడు వైద్యుడిని సంప్ర‌దిచాలి.
* స‌డ‌న్‌గా జ్వ‌రం రావ‌డం.ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే మాత్రం వైద్యుడిని సంప్ర‌దించాలి.

Tags :
|
|

Advertisement