Advertisement

త్వరలో రాంగోపాల్ వర్మ బయోపిక్

By: chandrasekar Wed, 26 Aug 2020 09:12 AM

త్వరలో రాంగోపాల్ వర్మ బయోపిక్


అనతి కాలంలో ప్రముఖ హీరోల బయోపిక్ తీసి సంచలనాలు సృష్టించిన రాంగోపాల్ వర్మ ఇప్పుడు మరో సంచలనానికి దారి తీశారు. కాంట్ర‌వ‌ర్సీ డైరెక్ట‌ర్ ఆర్జీవీ మ‌రో బాంబ్ పేల్చారు. లాక్ డౌన్ స‌మ‌యంలో ప‌లు సినిమాలు తీయబోతున్న‌ట్లు ఫ‌స్ట్ లుక్కులు రిలీజ్ చేసి, అంద‌రినీ అయోమ‌యం చేసిన వ‌ర్మ ఈ సారి ఏకంగా త‌న బ‌యోపిక్కే తీస్తున్న‌ట్లు చెప్పి మ‌రోసారి హాట్ టాపిక్ గా మారారు.

సంచలనాలకు కేంద్ర బిందువైన రాంగోపాల్ వర్మ ఎందరో జీవితాలను తెరకెక్కించిన ఈయన తన బయోపిక్ కూడా రాబోతోందంటూ స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను బుధ‌వారం సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నట్టు తెలిపాడు. అయన ఏమి చేసిన వార్తల్లో ప్రముఖంగా వుంటారు.

ఆయన తీయబోయే ఈ సినిమా మూడు భాగాలుగా ఉంటుందని ఆ మూడు సినిమాలు కలిపి 6 గంటల నిడివి కలిగి ఉంటుందని వెల్లడించారు. బొమ్మాకు మురళి నిర్మాణంలో దొరసాయి తేజ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారని తెలిపారు. వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభమవుతుందని చెప్పాడు. మరి ఈ సినిమా ఎన్ని సంచలనాలకు దారి తీస్తుందో వేచి చూస్తాం.

Tags :
|

Advertisement