Advertisement

  • ఫాస్ట్‌ఫుడ్ మరియు జంక్ ఫుడ్ వల్ల సంతాన సమస్యలు?

ఫాస్ట్‌ఫుడ్ మరియు జంక్ ఫుడ్ వల్ల సంతాన సమస్యలు?

By: chandrasekar Mon, 14 Sept 2020 09:21 AM

ఫాస్ట్‌ఫుడ్ మరియు జంక్ ఫుడ్ వల్ల సంతాన సమస్యలు?


ప్రపంచవ్యాప్తంగా చేపట్టిన రక రకాల పరిశోధనల్లో మహిళలు అధికంగా ఫాస్ట్‌ఫుడ్ మరియు జంక్ ఫుడ్ తీసికోవడం వల్ల సంతాన సమస్యలు ఎదురవుతున్నట్లు వెల్లడించారు. నేటి తరం జీవనశైలిలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ఎంతో మంది జంక్ ఫుడ్ తినడానికే ఇష్ట పడుతున్నారు. అయితే ఇలా జంక్ ఫుడ్ కు బానిసయ్యేవా రికి మాత్రం ఇది నిజంగా చేదు వార్తే కావొచ్చు.

ప్రపంచవ్యాప్తంగా జంక్ ఫుడ్ అతిగా తినేవారిపై ఓ సంస్థ అధ్యయనం చేసింది. అడిలైడ్‌లోని రాబిన్‌సన్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన పరిశోధకులు మహిళలపై జంక్ ఫుడ్ ప్రభావాలపై సర్వే చేశారు. మహిళలు ఫాస్ట్‌ఫుడ్‌కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని, లేకపోతే భవిష్యత్తులో సంతాన సమస్యలు తప్పవని ఈ పరిశోధనలో వెల్లడైంది.

ప్రస్తుతం యూకే, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్, ఐర్లాండ్ దేశాల్లో సంతాన సమస్యలు ఎదుర్కొంటున్న సుమారు 5 వేల మంది మహిళలపై పరిశోధన నిర్వహించారు. పిజ్జా, బర్గర్లు, ఫ్రైడ్ చికెన్, ఫ్రైడ్ ఆలూ చిప్స్, డోనట్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, చాట్ లాంటివి సంతాన సామర్థ్యం తగ్గిస్తాయని ఈ అధ్యయనంలో తేలింది.

చెడు వ్యసనాలు మద్యపానం, ధూమపానం, వయసు, శరీరతత్వం వంటివి కూడా సంతాన సామర్థ్యంపై ప్రత్యక్షంగా ప్రభావం చూపుతున్నట్లు స్పష్టం వెల్లడైంది. ఫాస్ట్ ఫుడ్ తక్కువగా తింటూ, పండ్లు ఎక్కువగా తినే మహిళల్లో సంతాన సామర్థ్యం ఎక్కువగా ఉండి, తక్కువ సమయంలోనే గర్భం దాల్చుతున్నట్లు ఈ అధ్యయనంలో తేలింది. ఇందువల్ల ఎక్కువగా ఆకుకూరలు, పచ్చి కాయగూరలు, పండ్లు తీసికోవడంవల్ల ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుందని తెలిపారు.

Tags :
|

Advertisement