Advertisement

  • కరోనా వ్యాక్సిన్ తయారీ లో పంది మాంసం... అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్న ముస్లిం దేశాలు...!

కరోనా వ్యాక్సిన్ తయారీ లో పంది మాంసం... అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్న ముస్లిం దేశాలు...!

By: Anji Wed, 23 Dec 2020 10:40 PM

కరోనా వ్యాక్సిన్ తయారీ లో పంది మాంసం... అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్న ముస్లిం దేశాలు...!

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అత్యున్నత ఇస్లామిక్ అథారిటీ కరోనా వైరస్ వ్యాక్సినేషన్‌పై ముస్లింలకు మార్గదర్శకాలు జారీ చేసింది.

కోవిడ్-19 టీకాలో పోర్క్ జిలాటిన్ ఉన్నట్లు వెల్లడికావడంతో ముస్లింలలో వ్యక్తమవుతున్న ఆందోళనపై యూఏఈ ఫత్వా కౌన్సిల్ స్పందించింది. పోర్క్ ప్రొడక్ట్స్‌ వాడకంపై ఇస్లామిక్ చట్టం ప్రకారం నిషేధం ఉన్న సంగతి తెలిసిందే.

యూఏఈ ఫత్వా కౌన్సిల్ చైర్మన్ షేక్ అబ్దల్లా బిన్ బయ్యా మాట్లాడుతూ.. కరోనా వైరస్ వ్యాక్సిన్లు ఇస్లాం పోర్క్ ఆంక్షల పరిధిలోకి రావని పేర్కొన్నారు. మనిషి ప్రాణాన్ని కాపాడటం అత్యంత ముఖ్యమైన అంశమని చెప్పారు.

వ్యాక్సిన్లలోని పోర్క్ జిలాటిన్‌ను ఔషధంగా పరిగణించాలని, దానిని ఆహారంగా భావించరాదని వివరించారు. యావత్తు మానవ సమాజానికి తీవ్ర నష్టం కలిగించే, అత్యంత వేగంగా విస్తరించే వైరస్‌పై వివిధ వ్యాక్సిన్లు మంచి ప్రభావం చూపుతున్నాయని అన్నారు.

మరోవైపు, దుబాయ్‌లో ఫైజర్-బయోఎన్‌టెక్ టీకా వ్యాక్సినేషన్‌కు యూఏఈ ప్రభుత్వం అనుమతించింది. దీంతో బుధవారం నుంచి ఉచితంగా టీకా పంపిణీ ప్రారంభమయ్యింది.

ఇప్పటికే చైనా టీకాను పరీక్షించిన యూఏఈ.. ఇది 86 శాతం ప్రభావంతంగా పనిచేస్తున్నట్టు ప్రకటించింది. మధ్య ఆసియాలో ప్రధాన వ్యాపార కేంద్రమైన దుబాయ్‌లో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి లాక్‌డౌన్ విధించారు. ఇప్పటి వరకు యూఏఈలో 195,000 మంది కరోనా వైరస్ బారినపడ్డారు.

ఇస్లాం, యూదు మతాకుల చెందిన కొందరు మత పెద్దలు కొవిడ్ వ్యాక్సిన్లలో పంది మాంసంతో చేసిన ఉత్ప‌త్తులు వాడుతున్నారని, వాటిని తీసుకోవద్దని సూచిస్తున్నారు. సదరు టీకాలను హలాల్(పవిత్ర పదార్థం)గా కాకుండా హరామ్(అపవిత్ర పదార్థం)గానే చూడాలని పిలుపునిస్తున్నారు.

కొన్ని ఇస్లామిక్ దేశాలు కొవిడ్ టీకా వాడకంపై తర్జనభర్జనలు పడుతున్నాయని వార్తలు వస్తున్నాయి. సాధార‌ణంగా వ్యాక్సిన్‌ల జీవిత‌కాలం పెంచ‌డానికి, స్టోరేజ్‌, ట్రాన్స్‌ఫోర్ట్‌లో అవి సుర‌క్షితంగా, స‌మ‌ర్థ‌వంతంగా ఉండ‌టానికి పంది మాంసంతో చేసిన జెలటిన్‌ను వాడుతుంటారు.

ఇప్పుడు వీటిపైనే ప‌లు ముస్లిం దేశాలు అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నాయి. ఇస్లాం, యూదులు పందిని అపవిత్ర జంతువుగా భావిస్తారు. అలాంటి జంతువు మాసం నుంచి సేకరించిన జిలాటిన్‌ను వ్యాక్సిన్ తయారీలో వాడటాన్ని మత పెద్దతు కొందరు ఆక్షేపిస్తున్నారు.

Tags :
|
|

Advertisement