Advertisement

నారింజ పండుతో సంపూర్ణ ఆరోగ్యం...

By: chandrasekar Mon, 02 Nov 2020 3:16 PM

నారింజ పండుతో సంపూర్ణ ఆరోగ్యం...


నారింజను సీజన్ తో సంబంధం లేకుండా ప్రతీ సీజన్ లోను తీసుకుంటారు. దీనిని చాలా మంది జ్యూస్ చేసుకుని తాగుతారు. అయితే చలికాలంలో ఎక్కువగా తీసుకుంటే ఎన్నో లాభాలు కలుగుతాయి. ప్రతీ రోజు ఒక గ్లాసు ఆరెంజ్ జ్యూస్ తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం అవుతుంది అని పోషకాహార నిపుణులు అంటున్నారు. నారింజను తినడం వల్ల తాజాదనం అనుభూతి కలుగుతుంది. అందుకే పొద్దునే ఆల్పాహారం పూర్తి చేసిన తరువాత.. లేదా మధ్యాహ్నం భోజనం అయ్యాక ఒక గ్లాసు ఆరెంజ్ తీసుకోవచ్చు

* నారింజ పండు వల్ల జీర్ణ వ్యవస్థ పూర్తిగా, చక్కగా పని చేయడం మొదలు పెడుతుంది. నారింజలో అత్యధిరంగా విటమిన్ సీ ఉంటుంది. ఇది ఒక సిట్రస్ ఫ్రూట్. సిట్రస్ ఫ్రూట్స్ లో విటమిన్ ఎక్కువగా ఉంటుంది. నిమ్మకాయ, బత్తాయి కూడా సిట్రస్ ఫ్రూట్సే.

* ఆరంజ్ లో చాలా తక్కువ పాళ్లలో కేలరీస్ ఉంటాయి. నారింజలో ఎలాంటి సెచ్యురేటెడ్ ఫ్యాట్ లేదా కొలెస్ట్రాల్ ఉండదు. అంతేకాదు ఇందులో డైటరీ ఫైబర్ కూడా ఉంటుంది. దీని వల్ల శరీరంలో ఉన్న విషతుల్యాలు బయటికి వెళ్లిపోతాయి.

* సహజసిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్స్ తత్వాలు నారింజలో ఉంటాయి. రక్తాన్ని శుభ్రపరుస్తుంది. స్డామినా పెంచుతుంది.

* నారింజ వల్ల విటమిన్ బీ కాంప్లెక్స్ కూడా ఎక్కువగా లభిస్తుంది. రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది. రక్తపోటును నియంత్రించడంలో నారిజలో ఉండో పోషకతత్వాలు ఉపయోగపడతాయి. ఎముకలు పటిష్టం అవుతాయి.

* నారింజలో ఫైబర్ విమటిన్ సీ కూడా అధికంగా ఉంటుంది. నారింజ తినడం వల్ల త్వరగా ఆకలి వేయదు. దాంతో బరువు పెరిగే సమస్యను చెక్ పెట్టవచ్చు.

Tags :
|
|

Advertisement