Advertisement

  • ఊబకాయం నుంచి తప్పించుకోవడానికి ఈ చిట్కాలు పాటించండి

ఊబకాయం నుంచి తప్పించుకోవడానికి ఈ చిట్కాలు పాటించండి

By: Sankar Sun, 20 Sept 2020 5:32 PM

ఊబకాయం నుంచి తప్పించుకోవడానికి ఈ చిట్కాలు పాటించండి


ఊబకాయం అధికమయ్యే కొద్దీ ఆలోచన శక్తి మందగిస్తున్నట్లు గుర్తించారు. వీరిలో తెల్ల రక్తకణాలు అతిగా స్పందించి మెదడులోని రోగ నిరోధక వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. మనలో చురుకుదనం తగ్గడం, ఆలోచన శక్తిపై ప్రభావం చూపి మన జీవనశైలి పూర్తిగా దెబ్బతింటుందని శారీరక వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు. కొన్ని చిట్కాలుపాటిస్తే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.

1. మంచినీళ్లు అధికంగా తాగాలి. తినడానికి అరగంట ముందు నీళ్లు తాగితే జీర్ణ ప్రక్రియ మెరుగవుతుంది. దాని ఫలితంగా బరువు కంట్రోల్‌లో ఉంటుంది

2. ఉదయం తినే అల్పాహారం మన ఆరోగ్యంలో కీలకపాత్ర పోషిస్తుంది. అందుకే బ్రేక్‌ఫాస్ట్ కాస్త అధికంగా తింటే అధిక కొవ్వు కరిగి బరువు తగ్గుతారని వైద్య నిపుణులు చెబుతున్నారు. బ్రేక్‌ఫాస్ట్ మానేస్తే మొదటికే మోసం వస్తుందట. రాత్రివేళ కాస్త తక్కువగా తినడంతో పాటు త్వరగా తినాలి.

3. కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారం తగ్గించాలి. కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకుంటే శరీరానికి మంచింది. జీర్ణప్రక్రియ సజావుగా ఉంటే అధిక బరువు సమస్య దరిచేరదు.

4. మధ్యాహ్నం భోజనంతో పాటు ఉడకబెట్టిన బంగాళ దుంపలు తీసుకోవాలి. దీంతో అధికంగా తీసుకునే ఆహారాన్ని మనకు తెలియకుండానే నియంత్రించుకుంటాం.

5. వర్క్ ఫ్రమ్ చేసినా ఇంటి పనులు చేసేందుకైనా మధ్యమధ్యలో కొన్నిసార్లు లేవాలి. దీనివల్ల సుదీర్ఘంగా కూర్చునే సమస్య తగ్గుతుంది. శరీరానికి కాస్త శ్రమ ఇవ్వడంతో కేలరీలకు కేలరీలు కరుగుతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది

6. భోజనం తిన్న వెంటనే చిరుతిళ్లు అసలు తినకూడదు. ఇంట్లో చేసిన వంటలైనా సరే కాస్త గ్యాప్ ఇచ్చి తినడం వల్ల కాస్త ఉపశమనం ఉంటుంది.

7. వ్యాయామం ఎరోబిక్స్ లాంటివి చేస్తే బరువు తగ్గవచ్చు. ప్రతిరోజు ఇలా చేయడం వల్ల శారీరక, మానసిక ఉల్లాసం మీ సొంతం.

Tags :
|
|
|

Advertisement