Advertisement

మెంతుల వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

By: Sankar Fri, 14 Aug 2020 7:11 PM

మెంతుల వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు


మెంతులు వంట‌ల్లో సువాస‌న కోసం మాత్ర‌మే కాదు, ఒంట్లో అనారోగ్యాన్ని పార‌దోల‌డానికి కూడా ఎంతో ఉప‌యోగ‌ప‌డుతాయి. మెంతులు వివిధ రూపాల్లో తీసుకోవ‌డం ద్వారా మ‌న‌కు ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలున్నాయి. అవేంటో చూద్దామా మ‌రి..

1. మెంతులు ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను క్ర‌మ‌బ‌ద్దీక‌రిస్తూ అజీర్తి, క‌డుపుబ్బ‌రాన్ని త‌గ్గిస్తాయి. కాబ‌ట్టి మ‌ధుమేహం ఉన్న‌వాళ్లు నిత్యం మెంతులు తీసుకోవ‌డం ఉత్త‌మం.

2.మెంతుల్లో ఉండే ఫైబ‌ర్ క‌డుపు నిండిన భావ‌న క‌లిగిస్తుంది. దాంతో మ‌నం మోతాదుకు మించిన ఆహారం తీసుకోకుండా అడ్డుకుంటుంది. దానివ‌ల్ల ఒంట్లో కొవ్వు క‌రుగుతుంది. కాబ‌ట్టి స్థూల‌కాయుల‌కు మెంతులు నిత్యావ‌స‌రం.

3.రాత్రిపూట ఒక చెంచా మెంతి గింజ‌ల‌ను నీటిలో నాన‌బెట్టి ఉద‌యం లేవ‌గానే ప‌రిగ‌డుపున ఆ నీళ్ల‌ను తాగాలి. దీంతో అజీర్తి స‌మ‌స్య తొల‌గిపోతుంది.

4.మెంతి గింజ‌ల‌ను పెనం మీద వేయించి, మెత్త‌గా దంచి పెట్టుకోవాలి. రోజూ ఉద‌యాన్నే ఆ పొడిని వేడి నీటిలో క‌లుపుకుని తాగితే ఎన్నో ఆరోగ్య స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం దొరుకుతుంది. ఈ పొడిని కూర‌ల్లో కూడా వాడుకోవ‌చ్చు.

5. ఒక చెంచా మెంతుల‌ను రోజూ ఉద‌యం, సాయంత్రం తీసుకోవ‌డంవ‌ల్ల కూడా జీర్ణ శ‌క్తి మెరుగుప‌డుతుంది. విరేచ‌నాలు త‌గ్గ‌డానికి కూడా మెంతులు తోడ్ప‌డుతాయి.

Tags :
|
|
|

Advertisement