Advertisement

మున‌గాకు చేసే మేలు ఏంటో ఒక‌సారి చూద్దామా..!

By: chandrasekar Tue, 20 Oct 2020 12:32 PM

మున‌గాకు చేసే మేలు ఏంటో ఒక‌సారి చూద్దామా..!


మున‌క్కాయ‌ల‌తో చేసిన వంటకాలన్ని ఎంతో రుచిగా ఉంటాయి. రుచితోపాటు మున‌క్కాయ‌ల్లో ఆరోగ్యానికి కావాల్సిన ఎన్నో పోష‌కాలు కూడా ఉన్నాయి. అయితే, ఆ పోష‌కాలు మున‌క్కాయ‌ల్లో కంటే మున‌గాకులో ఇంకా ఎక్కువ‌గా ఉంటాయ‌ని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మున‌గాకును ఆకు కూర‌గానో, ప‌ప్పులో లేదంటే ప‌చ్చ‌డిగానో చేసుకుని తిన‌డంవ‌ల్ల ఆరోగ్యానికి చాలా మేలు జ‌రుగుతుందని చెబుతున్నారు.

* వర్షాకాలంలో మునగాకును ఎక్కువగా వాడటంవల్ల వ్యాధినిరోధకశక్తి పెరుగుతుంది. అంతేగాక ఈ కాలంలో తరచుగా వచ్చే జలుబు, దగ్గులాంటి ఇబ్బందుల నుంచి కూడా ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

* పాలకూరతో పోలిస్తే మున‌గాకులో మూడు రెట్లు ఎక్కువగా ఇనుము ఉంటుంది. అరటిపండు కంటే ఏడు రెట్లు ఎక్కువగా మెగ్నీషియం లభిస్తుంది. పాలల్లో కంటే రెండు రెట్లు ఎక్కువగా ప్రొటీన్లు ఉంటాయి.

* ఈ ఇనుము, మెగ్నీషియం మనల్ని త్వరగా అలసటకు గురికాకుండా చేస్తుంది.

* మునగాకులో ఎక్కువగా ఉండే పీచువల్ల కాస్త తినగానే కడుపు నిండిన భావన కలుగుతుంది. అందువ‌ల్ల మున‌గాకును నిత్యం వాడ‌టంవ‌ల్ల అతిగా తిన‌డం అనే స‌మ‌స్య తీరుతుంది.

* మునగలోని విటమిన్‌-ఎ చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది.

* మున‌గాకులోని అమైనో ఆమ్లాలు ప్రొటీన్‌ ఉత్పత్తికి తోడ్పతాయి. ఈ ప్రొటీన్‌ జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. కడుపులోని పుండ్లు, ఇన్‌ఫెక్షన్లను తగ్గిస్తుంది.

* మున‌గాకులో ఉండే క్లోరోజనిక్‌ ఆమ్లం కొవ్వును కరిగిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తుంది. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడంలో సాయపడుతుంది.

Tags :
|

Advertisement