Advertisement

  • ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్... జన ఆరోగ్య సమితిలను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ...!

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్... జన ఆరోగ్య సమితిలను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ...!

By: Anji Wed, 16 Dec 2020 12:45 PM

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్... జన ఆరోగ్య సమితిలను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ...!

ప్రజల్లో ఆరోగ్య సమస్యలు, వ్యాధులపై అప్రమత్తత, అవగాహన కల్పించేందుకు జన ఆరోగ్య సమితిలు ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలో జన ఆరోగ్య సమితిలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది.

గ్రామ స్థాయిలో ఏర్పాటు చేయనున్న జన ఆరోగ్య సమితి ఛైర్మన్గా గ్రామ సర్పంచ్ వ్యవహరించనుండగా.. సహ చైర్మన్గా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుడు ఉంటారు.

మెంబర్ సెక్రటరీగా మిడిల్ లెవల్ హెల్త్ ప్రొవైడర్లను నియమించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.

జన ఆరోగ్య సమితిలను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.

Tags :

Advertisement