Advertisement

  • ఇది విన్నారా... సపోటా పండు వల్ల ఎన్ని లాభాలో తెలుసా...?

ఇది విన్నారా... సపోటా పండు వల్ల ఎన్ని లాభాలో తెలుసా...?

By: Anji Thu, 12 Nov 2020 4:32 PM

ఇది విన్నారా... సపోటా పండు వల్ల ఎన్ని లాభాలో తెలుసా...?

స‌పోటా పండ్లు.. చూసేందుకు అవి అంత ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపించ‌వు. కానీ సపోటా అద్భుతమైన రుచిని అందించే ఆరోగ్యకర పండ్లలో ఒకటి. రుచితో పాటు బోలెడన్ని పోషకాల సమాహారమే సపోటా.

తేలిగ్గా జీర్ణ‌మ‌వ‌డ‌మే గాక తగినంత శ‌క్తిని అందిస్తాయి కనుక అందరూ వీటిని ఎంతో ఇష్టపడతారు. ఇతర పండ్లతో పోల్చితే చౌక కూడా. సీజనల్ గా దొరికే పండ్లను, కూరగాయలను తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాము.

ఈ సీజ‌న్‌లో సపోటా ఎక్కువ‌గా దొరుకుతుంది గనుక అందరూ రోజుకు రెండు పండ్లు తినటం మంచిది. సపోటా వల్ల కలిగే ఆరోగ్య పరమైన ఉపయోగాలను ఇప్పుడు తెలుసుకుందాం..

నీరసంగా ఉన్నప్పుడు సపోటా పండ్లను తింటే శరీరానికి తక్షణ శక్తి లభించి మిమ్మల్ని యాక్టివ్ గా ఉంచుతుంది. అయితే ఇందులో చక్కెర శాతం అధికం కాబట్టి మధుమేహులు పరిమితంగా తీసుకోవాలి.

సపోటా పండు శక్తివంతమైన ఉపశమనకారి కావడం వల్ల నరాల ఒత్తిడిని తగ్గిస్తుంది. నిద్రలేమితో, అందోళనతో బాధపడుతున్న వ్యక్తులకు సపోటా చాలా మంచిది. దీనిలో అధికంగా ఉండే ‘విటమిన్ ఎ’ కంటిచూపును మెరుగుపరచేందుకు దోహదం చేస్తుంది.

స‌పోటా పండ్ల‌లో మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ స‌మృద్ధిగా ఉంటాయి. ఇవి మ‌న‌కు సంపూర్ణ పోష‌ణ‌ను అందిస్తాయి. మెద‌డు ప‌నితీరును మెరుగుప‌రుస్తాయి. జ్ఞాప‌క‌శ‌క్తిని పెంచుతాయి. ఇది జలుబు, దగ్గు తగ్గడానికి కూడా దోహద పడుతుంది.

పిండిపదార్థాలు, అవసరమైన ఇతర పోషకాలు సపోటాలో అధిక మోతాదులో ఉండటం వల్ల గర్భిణీలకు, పాలు ఇచ్చే తల్లులకు చాలా ఉపయోగకరమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

సన్ ఎలర్జీ ఉన్నవారు ఎండలోకి వెళ్ళగానే చర్మం ఎర్రగా మారి దురద పెడుతుంది. అలాంటివారు రోజుకు రెండు సపోటాలను తింటే అందులోని విటమిన్ సి కారణంగా ఈ ఇబ్బంది దూరమవుతుంది.

సపోటా లోని యాంటీ-ఆక్సిడెంట్లు, పీచు పదార్దాలు, పోషకాలు, విటమిన్ ఎ ఊపిరితిత్తుల, నోటి కాన్సర్ నుండి రక్షణ అందిస్తుంది. కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్ స‌పోటాల్లో సమృద్ధిగా ఉండడం వల్ల సపోటా పండ్లు ఎముకల దృఢ‌త్వానికి బాగా సహాయపడుతాయి.

సపోటాలు మూత్రపిండాల్లో రాళ్ళను తొలగించడానికి సహాయపడి, మూత్రవిసర్జన కారకాలుగా పనిచేస్తాయి. అలాగే ఇవి మూత్రపిండాల వ్యాధుల నుండి రక్షణను అందిస్తాయి. సపోటా పండు బరువు తగ్గడంలో పరోక్షంగా సహాయపడుతుంది.

గ్యాస్ట్రిక్ ఎంజైమ్ స్రావాన్ని నియంత్రించడం ద్వారా ఊబకాయాన్ని నిరోధిస్తుంది. తద్వారా జీవక్రియను నియంత్రిస్తుంది. సపోటా వినియోగం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి సీజనల్ అనారోగ్యాల బెడద బాగా తగ్గుతుంది.

సపోటా పండులో యాంటీ-ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండడం వల్ల ముడతలను తగ్గించడంలో ప్రభావాన్ని చూపిస్తుంది.

Tags :
|
|

Advertisement