Advertisement

  • ఇది మీకు తెలుసా... ఎండుకొబ్బరి తినేవాళ్లకు కాన్సర్ దరిచేరదు...!

ఇది మీకు తెలుసా... ఎండుకొబ్బరి తినేవాళ్లకు కాన్సర్ దరిచేరదు...!

By: Anji Wed, 18 Nov 2020 9:03 PM

ఇది మీకు తెలుసా... ఎండుకొబ్బరి తినేవాళ్లకు కాన్సర్ దరిచేరదు...!

మన చుట్టూ ఉన్న వస్తువులు మనం ప్రతి రోజు తినే పదార్థాల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. అయితే మనం పోషకాలు అందించేవి కాకుండా పెద్దగా ఉపయోగంలేని పదార్థాలను తింటూ ఉంటాం.

ఎండుకొబ్బరి ఎంతో మేలు చేస్తుంది. ఇది జీర్ణం అవ్వడానికి కాస్త టైమ్ తీసుకుంటుంది కానీ… మన శరీరానికి మాత్రం ఎంతో మేలు చేస్తుంది. దీనిని మనం గ్రేవీ కూరలలో, స్వీట్స్ లో కూడా వాడుతాం. ఎ

ఎండుకొబ్బరి రకరకాల వ్యాధుల్ని తరిమికొట్టే శక్తి ఉంది. ఇప్పుడు దీనిని తినడం వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం..

రోజూ ఎండుకొబ్బరి తినేవాళ్లకు కాన్సర్ దరిచేరదు. ఆల్రెడీ వ్యాధి సోకిన వాళ్లు కూడా ఎండుకొబ్బరి తింటే… ఉత్తమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పేగుల్లో కాన్సర్, ప్రొస్టేట్ కాన్సర్‌కి ఎండుకొబ్బరి చక్కటి మందులా పనిచేస్తోందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

ఎండుకొబ్బరి బ్రెయిన్ ఫంక్షన్ ను మెరుగుపరుస్తుంది. హెల్తీ బ్రెయిన్ ను ప్రోత్సహిస్తుంది. మతిమరుపు వంటి సమస్యలను, ఇతర బ్రెయిన్ డెడ్ సమస్యలను కూడా నివారిస్తుంది.

ఎండుకొబ్బరిని మితంగా తినడం వల్ల మలబద్దకం, అల్సర్ , హెమరాయిడ్స్ వంటి జీర్ణ సమస్యలుండవు. ఎండుకొబ్బరి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు.

ఎండుకొబ్బరి లో డైటరీ ఫైబర్ అధికంగా ఉండటం వల్ల ఇది హార్ట్ కు మంచిది. మగవారికి రోజుకి కనీసం 38 గ్రాముల డైటరీ ఫైబర్ అవసరం అవుతుంది. ఆడవాళ్లకు 25 గ్రాములు అవసరం అవుతుంది. ఈ డైటరీ ఫైబర్ వల్ల గుండెకు సంబంధించిన సమస్యలు దూరం అవుతాయి.

రోజూ చిన్న ఎండుకొబ్బరి ముక్క తింటే అందులోని ఫైబర్ వల్ల గుండె హాయిగా ఉంటుంది.మహిళల్లో ఒక వయస్సు వచ్చిన తర్వాత రక్తహీనతకు గురి అవుతుంటారు. ఐరన్ లోపం వల్ల అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. ఎండుకొబ్బరి లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తహీనతకు నివారిస్తుంది.

ఎండుకొబ్బరి వ్యాధినిరోధకశక్తిని పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.దీనిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. దీనిలో ఉండే సెలీనియం సెలనో ప్రోటీన్స్ ను పెంచడం వల్ల అనేక వ్యాధులను నివారించుకోవచ్చు.

మగాళ్లలో మగతనాన్ని పెంచే లక్షణం ఎండుకొబ్బరిలో ఉందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ఎండుకొబ్బరి సంతానలేమిని దూరం చేస్తుంది. స్పెర్మ్ కౌంట్ పెంచుతుంది. వంధత్వాన్ని నివారిస్తుంది. ఎండుకొబ్బరిలోని సెలీనియమే ఇందుకు కారణం.

Tags :

Advertisement