Advertisement

  • ఈ ఇంటి చిట్కాల ద్వారా గ్యాస్ట్రిక్ సమస్య నయం చేసుకోవచ్చు....!

ఈ ఇంటి చిట్కాల ద్వారా గ్యాస్ట్రిక్ సమస్య నయం చేసుకోవచ్చు....!

By: Anji Sat, 05 Dec 2020 12:32 PM

ఈ ఇంటి చిట్కాల ద్వారా గ్యాస్ట్రిక్ సమస్య నయం చేసుకోవచ్చు....!

గ్యాస్ట్రిక్ సమస్యలు మొదలైతే చాలు.. ఎవ‌రికైనా స‌రే చాలా ఇబ్బందిగా ఉంటుంది. క‌డుపు ఉబ్బ‌రం, ఛాతి నొప్పి, గ్యాస్ వ‌స్తుండ‌డం.. త‌దిత‌ర స‌మ‌స్య‌ల‌తో ఇబ్బంది ప‌డాల్సి వ‌స్తుంది.

ఈ సమస్య కారణంగా ఏదైనా తినాలన్నా భయమే. అయితే గ్యాస్ స‌మ‌స్య వ‌చ్చేందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. మ‌ల‌బ‌ద్ద‌కం, పేగుల్లో స‌మ‌స్య‌, మ‌ధుమేహం, అల్స‌ర్లు ఉండ‌డం, స‌రైన వేళ‌కు ఆహారం తీసుకోక‌పోవ‌డం, ఉప‌వాసం మ‌రీ ఎక్కువ‌గా ఉండ‌డం, మ‌ద్యం సేవించ‌డం, ధూమ‌పానం.. వంటి అనేక కార‌ణాల వ‌ల్ల గ్యాస్ స‌మ‌స్య వ‌స్తుంది.

అలాంటప్పుడు కొన్ని ఇంటి చిట్కాల ద్వారా సహజసిద్ధంగానే ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. దీనికి సంబంధించిన అనేక ఆహారపదార్థాలు మన వంటింట్లోనే అందుబాటులో ఉంటాయి. అవేంటో.. ఇప్పుడు తెలుసుకుందాం…

గాస్ట్రిక్ సమస్యకు తగ్గించేందుకు భోజనం తర్వాత ఓ టీస్పూన్ అల్లం తురుముని ఒక టీస్పూన్ నిమ్మరసంతో కలిపి తీసుకోవాలి. అల్లం టీ తాగడం కూడా గ్యాస్ ఉపశమనానికి ఉత్తమ ఇంటి నివారణగా చెప్పబడుతుంది.

ఒక గిన్నెలో కొద్దిగా నీటిని తీసుకుని జీల‌క‌ర్ర లేదా వాము 4 టీస్పూన్లు వేసి నీటిని బాగా మ‌రిగించి తర్వాత నీటిని వ‌డ‌క‌ట్టి వేడిగా ఉంగానే తాగేయాలి. దీంతో గ్యాస్ స‌మస్య నుంచి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది.

జీర్ణసమస్యలను తగ్గించుకునేందుకు ఒక కప్పు నీటిలో 1 టీస్పూన్ నిమ్మరసం, సగం టీస్పూన్ బేకింగ్ సోడాను కలిపి తాగితే జీర్ణక్రియ ప్రక్రియను సులభతరం చేసే కార్బన్ డై ఆక్సైడ్ ఏర్పడటానికి సహాయపడుతుంది. కాబట్టి మీ భోజనం తర్వాత దీనిని తీసుకోవచ్చు.

కొద్దిగా ఇంగువను గోరువెచ్చని నీటితో కలిపి తీసుకోవడం ద్వారా గ్యాస్ సమస్యను అరికట్టవచ్చు.ఒక గిన్నెలో నీటిని తీసుకుని అందులో కొన్ని పుదీనా ఆకులు వేసి బాగా మ‌రిగించి అందులో 1 టీస్పూన్ తేనె క‌లిపి వేడిగా ఉండ‌గానే తాగితే గ్యాస్ సమస్య త‌గ్గుతుంది.

గోరు వెచ్చ‌ని పాల‌లో దాల్చిన చెక్క పొడి, తేనెల‌ను తీసుకుని బాగా క‌లిపి తాగితే గ్యాస్ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వచ్చు.

ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో 1 టీస్పూన్ యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌ను క‌లిపి తాగినా గ్యాస్ స‌మ‌స్య త‌గ్గుతుంది.

వామును కొద్దిగా నీటిలో వేసి మరిగించిన తర్వాత ఆ నీటిని వడగట్టి తాగితే గ్యాస్ సమస్యలను నుడి ఉపశమనం పొందుతారు.

Tags :

Advertisement