Advertisement

దగ్గు తగ్గేందుకు ఇంటి చిట్కాలు

By: Sankar Thu, 18 June 2020 2:37 PM

దగ్గు తగ్గేందుకు ఇంటి చిట్కాలు



అసలే కరోనా కాలం. ఇప్పుడు గట్టిగా దగ్గినా, తుమ్మినా సరే.. అనుమానించి క్వారంటైన్లోకి పంపేస్తారు. సీజన్ల మార్పులో సాధారణంగా వచ్చే జలుపు, దగ్గు, తుమ్ములను ఒకప్పుడు పెద్దగా పట్టించుకోకపోయినా.. ఇప్పుడు మాత్రం చాలా సీరియస్‌గా తీసుకుంటున్నారు. ఈ సమయంలో వైరల్ ఫీవర్లు వచ్చినా సరే ప్రమాదమే. ముఖ్యంగా దగ్గు ఒకసారి వచ్చిందంటే.. దాన్ని నివారించడం చాలా కష్టం. టానిక్‌లు, యాంటిబయోటిక్స్ తీసుకున్నా వెంటనే ఫలితం ఉండదు. అయితే, ఇంట్లోనే మనం దగ్గుకు మందు తయారు చేసుకోవచ్చు. అది ఎలాగో చూడండి

1 పసుపులో యాంటీ బ్యాక్టీరియా, యాంటీ వైరల్ గుణాలు ఎక్కువ. పసుపులో ఉండే కార్టూమన్స్ దగ్గు తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. దగ్గు బాగా వేధిస్తుంటే.. కొద్దిగా పసుపు, కాస్త తేనె కలిపిన మిశ్రమాన్ని తాగండి.

2 గోరు వెచ్చని పాలల్లో కొద్దిగా మిరియాల పొడి వేయండి. దీనివల్ల దగ్గు నుంచి వేగంగా ఉపశమనం పొందవచ్చు.

home,remedies,cough,health,cold ,దగ్గు , ఇంటి,  చిట్కాలు,  పసుపు,  తేనె



3 అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కోసి నీటిలో వేయండి. ఆ తర్వాత నీటిని బాగా మరిగించండి. దీనివల్ల అల్లంలో ఉండే ఔషదాలన్నీ నీటిలో కలుస్తాయి. ఈ అల్లం టీని రోజుకు 2 నుంచి 3 సార్లు తీసుకుంటే దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది.

4 కఫం దగ్గుతో బాధపడుతున్నట్లయితే గోరు వెచ్చని నీటిలో ఉప్పు వేసి కలపండి. ఆ నీటిలో నోటిలో వేసుకుని బాగా పుకిలించండి. దీనివల్ల గొంతులో ఉండే శ్లేష్మం (కఫం) బయటకు వచ్చేస్తుంది.

5 శ్వాసపై నియంత్రణ ద్వారా కూడా దగ్గును తగ్గించవచ్చు. మీ ముక్కు ద్వారా లోతుగా శ్వాస పీల్చండి. అలా రెండు సెకన్ల పాటు ఉంచి గాలిని బయటకు వదలేయండి. దీనివల్ల కొద్ది క్షణాల్లో దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది.


Tags :
|
|
|

Advertisement